ఈ కాలంలో వాట్సాప్ వాడని వారు ఉండరు.. ఒంటిమీదకు 12 ఏళ్ళు వచ్చాయంటే చాలు వాట్సాప్ వాడటం మొదలు పెడుతారు. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు తిండి, నీరు, నిద్రలాగా వాట్సాప్ కూడా ఒక భాగం అయిపోయింది. అలాంటి వాట్సాప్ వినియోగదారులకు ఓ సంచలనమైన వార్త. 

 

అదేంటంటే.. మీ వాట్సాప్ ను పాకిస్థాన్ వారు హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు భారత సైనికులు. ఏంటి అని అనుకుంటున్నారా ?  అదే విషయానికి వస్తున్న భారత సైనికులకు వాట్సాప్ సెట్టింగ్స్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఈరోజు వినియోగదారులకు ఓ సంచలన సూచన చేసింది. పాకిస్థానీ గ్రూప్‌లు మన జవాన్లకు ప్రమేయం లేకుండా వారి ఫోన్ నంబర్లను వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తున్నాయి.

 

దీంతో జవాన్లకు హనీ ట్రాప్, పాక్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇది దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిణామం కావడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ప్రైవసీ సెట్టింగ్స్‌ను ‘మై కాంటాక్ట్స్’గా మార్చుకోవాలని సలహా ఇచ్చింది. ఇటీవల ఓ ఆర్మీ జవాన్‌ను +923032569307 అనే నంబర్ ద్వారా ఓ పాకిస్థాన్ గ్రూప్‌లో యాడ్ చేశారు. 

 

అయితే వెంటనే అప్రమత్తమైన జవాన్ ఆయన స్క్రీన్ షాట్లు తీసి, ఆ గ్రూప్ నుంచి బయటకొచ్చి.. ఉన్నత అధికారులకు సమాచారం అందించాడు. అయితే ఈ ముప్పు కేవలం సైనికులు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులు, సామాన్యులను కూడా పాకిస్థాన్ వాట్సాప్ గ్రూప్‌లు టార్గెట్ చేసే అవకాశం ఉంది. 

 


అందుకే ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు తెలియని వ్యక్తులు ఎవరూ గ్రూపుల్లో యాడ్ చేయకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలని ఆర్మీ సూచించింది. ఇలా చేసుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. కేవలం ఇందుకోసం చేయాల్సిందల్లా.. వాట్సాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ కి వెళ్లి అందులో అకౌంట్ లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ ప్రైవసీ ఆప్షన్ లో గ్రూప్ అని ఉంటుంది. అందులోకి వెళ్లి.. 'మై కాంటాక్ట్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే చాలు. ఇలా చెయ్యడం వల్ల అపరిచితులెవరూ మన వాట్సాప్ నంబర్‌ను మన ప్రమేయం లేకుండా గ్రూపుల్లో యాడ్ చేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: