ఈ కథలో ఒక హర్రర్ సినిమాకు కావాల్సినంత హర్రర్ స్టోరీ ఉన్నది.  ఒక రాజ్యానికి సంబంధించిన కథ ఉంటుంది.  ఎలా మోసం చేస్తారు. మోసం చేసిన వాళ్ళు ఎలా పగ తీర్చుకుంటారు అనే  కథనం ఉంటుంది.  తమ్ముడి కోసం అన్న ప్రాణాలు కోల్పోవడంలో బంధాలు, బంధుత్వాలు అంటే ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.  ఈ ఒక్క స్టోరీని చదివితే కనీసం రెండు మూడు రకాల కథలు తయారు చేసుకోవచ్చు.  

అనగనగా పూణే నగరంలోని ఓ కోట.  ఆ కోటకు చాలా పెద్ద చరిత్ర ఉన్నది.  ఆ కోట గురించి తెలుసుకోవాలి అంటే 17 వ శతాబ్దానికి వెళ్ళాలి.  17 వ శతాబ్దంలో పూనాలోని కోటను బాజీరావు పేష్వా నిర్మించారు. కోటను నిర్మించి పరిపాలన సాగించారు.  బాజీరావు తరువాత బాలాజీ బాజీరావు మరాఠా రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు.  ఆయన తన శక్తి యుక్తులతో రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడు.  రాజ్యంలో సుపరిపాలన సాగిస్తుంటాడు.  బాలాజీ బాజీరావు అలియాస్ నానా సాహెబ్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు.  అందులో పెద్దవాడు మాధవ్ రావు, రెండో వాడు విశ్వాస్ రావు, మూడో వాడు నారాయణ రావు.  


బాలాజీ బాజీరావు మరణం తరువాత పెద్ద కుమారుడు మాధవ్ రావు రాజుగా బాధ్యతలు చేపడుతాడు.  అయితే, ఓసారి జరిగిన భీకర యుద్ధంలో అన్నకు  బదులుగా యుద్దానికి వెళ్లి తమ్ముడు విశ్వాస్ రావు వీర మరణం పొందుతాడు.  తమ్ముడు మరణాన్ని భరించలేని మాధవ్ రావు ఆత్మహత్య చేసుకుంటాడు.  విశ్వాస్ రావు, మాధవ్ రావు ఇద్దరు మరణించడంతో ఆ భారం చిన్న తమ్ముడు నారాయణ రావుపై పడుతుంది.  


అయితే, నారాయణ రావుకు అధికారం చేపట్టే సమయానికి కేవలం 16 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి.  దీంతో పినతండ్రి రఘునాధ్ రావు సంరక్షణలో బాధ్యతలు చేపడతారు.  అంతా బాగానే ఉందని నమ్ముతాడు నారాయణ రావు.  కానీ, పినతండ్రి, పినతల్లి కుట్రలు చేస్తున్నారని తెలుసుకోలేకపోతాడు.  1773 వ సంవత్సరానికి అధికారం చేపట్టిన తరువాత నారాయణ రావుపై క్రమంగా ఆధిపత్యం చలాయిస్తారు రఘునాధ్ రావు అయన భార్య ఆనంది.  


ఇదే సమయంలో రాజ్యంలో గార్డి అనే గిరిజన తెగలో విభేదాలు వస్తాయి.  వాటిని ఆనంది క్యాష్ చేసుకుంటుంది.  గిరిజన తెగ నాయకుడికి భర్త ద్వారా లేఖ రాస్తుంది.  గిరిజన తెగకు చెందిన కొంతమంది వ్యక్తులు కోటలోకి ప్రవేశించి పౌర్ణమి రోజున అంతపురంలో నిద్రపోతున్న నారాయణ రావును హతమారుస్తారు.  ముక్కలు ముక్కలుగా శరీరాన్ని కోసి తీసుకెళ్లి నదిలో పడేస్తారు.  ఇది చరిత్ర.  అయితే, పార్టీ పౌర్ణమి రోజున నారాయణ రావు ఆత్మ ఆ కోటలోకి వస్తుందట.  అక్కడ ఉన్న వ్యక్తులను శత్రువులుగా భావించి చంపేస్తుంది.  అందుకే పౌర్ణమి రోజున ఆ కోటలోకి ఎవరిని అనుమతించరు.  సెక్యూరిటీని టైట్ చేస్తారు. పూర్ణమి రోజు సాయంత్రం 5 తరువాత అక్కడ ఎవరూ ఉండరు.  గతంలో ఇలానే దొంగచాటుగా లోనికి వెళ్లిన కొందరు మృత్యువాత పడ్డారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: