రచ్చబండ.. ఈ రచ్చబండను ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు ప్రజాభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసం నాడు ప్రారంబించాలనుకున్నారు. కానీ అతను ఈరోజు అయితే కార్యక్రమంకు ముహూర్తం పెట్టాడో ఆరోజే ఆ రచ్చబండకు వెళ్తూ దుర్మరణం చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని శోకాన్ని మిగిల్చిపోయారు. 

 

అయితే ఇప్పుడూ ఆ రచ్చబండను మల్లి తిరుకురానున్నారు. ఎవరో కాదు ఆ రాజన్న బిడ్డ సీఎం జగన్ ఇప్పుడు రచ్చబండ కార్యక్రమంతో జనాల్లో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫ్రిబ్రవరీ నుండి ప్రారంభించాలని అభిప్రాయపడుతున్నారు. 

 

ప్రజల వద్దకు నేరుగా ముఖ్యమంత్రిగా వెళ్లి వారికీ అందుతున్న కార్యక్రమాల గురించి సీఎం జగన్ స్వయంగా తెలుసుకోనున్నారు. ఇంకా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ? ఆ ఇబ్బందులను పరిష్కరించేలా ఈ రచ్చబండను రూపొందిస్తున్నారు. ఈ నిర్ణయాలు అన్ని నిన్న అమరావతిలో జరిగిన అధికారుల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ తీసుకున్న నిర్ణయం ఇది. 

 

సీఎం జగన్ తాను రచ్చబండకు వెళ్తే కచ్చితంగా హామీలు ఇస్తానని, వాటిని ఎప్పటికపుడు చూసుకుని పరిష్కారం అయ్యేలా చేయాల్సింది అధికారులేనని జగన్ క్లారిటీగా చెప్పేశారు. దీంతో అధికారులు కూడా రచ్చబండ అంటే వణుకుపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఎం జగన్ పెట్టిన ఆంక్షలతో గవర్నమెంట్ ఉద్యోగులు తూచాతప్పకుండా సమయాన్ని పాటిస్తూ, ప్రజలతో మంచిగా ఉంటూ వారికీ కావాల్సిన సేవలను అందిస్తున్నారు. 

 

తన తండ్రి ప్రకటించిన రచ్చబండ పేరు తోనే జనంలోకి వెళ్ళాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. రచ్చబండ పేరుతో  ప్రజలను కలిసి వారి కష్టనష్టాలను తెలుసుకొని ప్రతిపక్షాలు సైతం నోరు మూసుకునే చేయాలనేదే సీఎం జగన్ ఆలోచన. ఏది ఏమైనా ఒక సీఎం డైరెక్ట్ ప్రజలను కలవడం అనేది ఎంతో సంతోష కరమైన వార్త అనే చెప్పాలి. 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: