దేశాన్ని ఉగ్రవాదం పట్టి పీడుస్తున్నట్లుగా జనాన్ని కామోగ్రవాదం పట్టి పీడుస్తున్నట్లుగా ఉంది. అందుకే ఎక్కడచూడు వ్యభిచార కేంద్రాలు కిరాణ షాపులు పెట్టినట్లుగా పెడుతున్నారు. పోలీసులు ఎంతగా జల్లెడపడుతున్న కొత్త కొత్త విధానాలతో విటులను ఆకర్శిస్తున్నారు. హైటెక్ వ్యభిచారాలకు తెరలేపుతున్నారు.

 

 

ఈ పాశ్యాత్య విషసంస్కృతి ఏపీ రాజధాని అమరావతికి కూడా పాకింది. ఇక్కడ తాజాగా మసాజ్‌లు, స్పాల పేరుతో నడుస్తున్న వ్యభిచార దందా వెలుగుచూసింది. అందమైన యువతులతో మసాజ్‌ల పేరిట నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠాల గుట్టురట్టైంది. ఈ కేటుగాళ్లూ జిమ్‌లు, స్పాల పేరుతో అనుమతులు తీసుకుని హైటెక్ తరహా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

 

మెట్రోపాలిటన్ నగరాలను మించిపోతున్న విజయవాడలో ఖరీదైన భవనాలు అద్దెకు తీసుకుని, నిర్వాహకులు. జిమ్‌ల పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరగడంతో విజయవాడ పోలీసులు స్పాలు, జిమ్‌లపై దాడులు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లు కనుగొన్నారు.

 

 

ఇక్కడ వీధికొక మసాజ్ సెంటర్, స్పా సెంటర్ ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఇకపోతే పోలీసు చేసిన దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలగా ధ్రువీకరించినట్లు సమాచారం. అలాగే పలువురు యువతులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

వ్యభిచార దందాను ఉపేక్షించేంది లేదని.. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న ఈ దందా మాత్రం ఆగడం లేదు.

 

 

ఈ ఊబిలోకి కొందరు డబ్బు సంపాధించాలనే మోహంతో దిగుతుంటే మరికొందరు దీన్నే జీవనోపాధిగా మార్చుకుని బ్రతుకుతున్నారు. కొందరు తెలియక ఈ రొచ్చులో కూరుకు పోతున్నారు. ఏది ఏమైన రానున్న కాలంలో ఇంకా ఈ సమస్య మరింతగా తలనొప్పులను తెచ్చిపెడుతుందంటున్నారు కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: