మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు జరగడానికి సన్నాహాలు మొదలయ్యాయి.  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  నిన్నటి రోజున జరిగిన చర్చల్లో మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.  శివసేన నేతృత్వంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు శరద్ పవార్ పేర్కొన్నారు.  దీంతో ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  
మహారాష్ట్ర సీఎం కావాలి అనే కల నెరవేరింది.  ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసలు కథ మొదలు అవుతుంది.  ఎంతకాలం పాటు అయన మహా ముఖ్యమంత్రిగా ఉంటారు అన్నది తెలియాలి.  ఎందుకంటే.. మూడు పార్టీల మధ్య ఎంతకాలం ముఖ్యమంత్రి పీఠం పంపకం అన్నది తెలియడం లేదు.  ఈ విషయాలను ఇంకా బయటపెట్టాల్సి ఉన్నది.  ఇప్పటికైతే, మంత్రి పీఠాన్ని మాత్రమే పంచుకున్నారు.  
మిగతా విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.  మంత్రి పదవుల విషయం గురించి, ఇతర అజెండా గురించి తెలియాల్సి ఉన్నది. ఐదేళ్లు శివసేన అభ్యర్ధే ముఖ్యమంత్రిగా ఉంటారు అని అంటున్నారు.  కానీ, ఎన్సీపీ, కాంగ్రెస్ లు మాత్రం ఇంకా దీనిపై ఓ కొలిక్కి రాలేదు. రెండేళ్లు ఉంటారా లేదంటే మూడేళ్లు ఉంటారా లేదంటే ఆరు నెలలే ఉంటారా అన్నది తెలియాలి.  మరోవైపు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని అంటున్నారు బీజేపీ నేతలు.   శివసేన ముఖ్యమంత్రి పీఠం ముచ్చట మూడునాళ్ళ ముచ్చటగానే ఉంటుందని అంటున్నారు.  మూడు నెలలకు మించి ఉండటం గగనం అని చెప్తున్నారు.  శివసేన మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నది.  అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్దవ్ థాకరే పోటీ చేయాల్సి ఉంటుంది.  అయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.  ఈ విషయంలో ఏం జరగబోతున్నది అన్నది త్వరలోనే తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: