ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని 50 రోజులపాటు సమ్మె చేశారు.  48 ఈరోజుల అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.  అయితే, హైకోర్టులో 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై తీర్పు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం భావించింది.  
దానికి అనుగుణంగానే ఆర్టీసీ ప్రైవేట్ రూట్లపై హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వం నిర్ణయించిన 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులు నడుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీంతో ప్రభుత్వం కొంతవరకు తన పంతాన్ని నెగ్గించుకుంది.  ఇప్ప్పుడు అసలు సమస్య ఉద్యోగులు.  5100 రూట్లు అంటే కనీసం 50%మేర రూట్లు ఈ బస్సులతో కవర్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఉద్యోగులు ఎందుకు.. ఏం చేసుకోవాలి.  
ప్రస్తుతం ఆర్టీసీలో 49వేలమంది ఉద్యోగులు ఉన్నారు.  ప్రతి ఏడాది కనీసం నాలుగువేలమంది చొప్పున రిటైర్ అవుతున్నారు.  ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరిగి చాలా రోజులైంది.  ఉన్నవాళ్ళని తీసేస్తుంటే కొత్తవాళ్లను ఎలా తీసుకుంటారు.  ప్రభుత్వం ఉన్న ఉద్యోగుల్లో సంగం మందిని తగ్గించుకోవడానికి ప్లాన్ చేస్తున్నది.  సగం మంది తగ్గించుకోవాలి అంటే వాళ్లందరికీ వీఆర్ఎస్ విధానాన్ని అమలు చేయాలి.  ప్రస్తుతం ప్రభుత్వం దీనిగురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.  
ఏడాదికి 4వేల మంది రిటైర్ అయితే.. సగం ఖాళీ కావాలి అంటే కనీసం ఐదేళ్లు పడుతుంది.  ఐదేళ్ల జీతాలు వగైరా ఇవ్వాలి.  అది ప్రభుత్వానికి పెనుభారం అవుతుంది.  అలా కాకుండా వన్ టైం సెటిల్మెంట్ పద్దతిలో వీఆర్ఎస్ విధానాన్ని తీసుకొస్తే.. కష్టమో నష్టమో ఉద్యోగులను తగ్గించుకోవచ్చు.. ఇదే సరైన పద్దతి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.  మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఉద్యోగులు అంగీకరిస్తారా..? ఒకవేళ వీఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తే వయసును బట్టి అమలు చేస్తుందా లేదంటే అవసరాన్ని బట్టి అమలు చేస్తుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: