మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయం మారింది.  ముఖ్యమంత్రి గా బీజేపీ నేత ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చింది బీజేపీ. శివసేన, కాంగ్రెస్ మరియు ఎన్సీపీ కలిసి నిన్న రెండు గంటల పాటు సమావేశం నిర్వహించి ఉద్ధవ్ ఠాక్రే ని ముఖ్యమంత్రి గా ప్రకటించారు శరద్ పవార్. అయితే బీజేపీ ఊహించని విధంగా పావులు కదిపి ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది రహస్య ఒప్పందమా? 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు స్వయానా మేనల్లుడు ఈ అజిత్ పవార్, ఈ నేపథ్యంలో బీజేపీ కి ఎన్సీపీ కి రహస్య ఒప్పందం పవార్ ఆధ్వర్యంలో జరిగిందని స్పష్టమవుతోంది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తెర వెనుక చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రి పరిణామాలు మారినట్లు తెలుస్తోంది. 

ఈ తెల్లవారుజామున రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శనివారం ఉదయం ప్రామాణం చేయించారు.  రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన కూటమికి భాజపాకు భారీ షాక్‌ ఇచ్చింది. ఎన్సీపీలో భారీ చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్‌ తెలిపారు. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ ఊహించని షాక్‌ ఇచ్చింది. సీఎంగా ఉద్దవ్‌ ఠాక్రేను ప్రకటించిన మరుసటి రోజే ఊహించని పరిణామం జరిగింది. కాగా పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాని ఈ అనూహ్య పరిణామం పై ఇంకా స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: