జనసేన అధినేత పవన్ కళ్యాణ్... జగన్ ఆరు నెలల పాలనపై ఆరు మాటల్లో చెప్పాలంటే అంటూ ఒక ట్వీట్ చేశారు.

శ్రీ రెడ్డి జగన్ గారి ఆరు నెలల పాలన, ఆరు మాటల్లో చెప్పాలంటే........ విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసికవేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం. అంటూ ఫస్ట్ ఒక ట్వీట్ చేశారు.

ఆ ఫస్టు ట్వీట్ చేసిన తర్వాత ఒక్కొక్క పదం పై వివరణ ఇస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్ కళ్యాణ్.

1. విధ్వంసం

కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వకంగా వరద నీరు తో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు.

2. దుందుడుకుతనం
కాంట్రాక్టు రద్దులు( పోలవరం క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అమరావతి రాజధాని, జపాన్ రాయబారి- సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు, ఆర్బిట్రేషన్లు)

3. కక్ష సాధింపుతనం

శ్రీకాకుళం లోని సామాన్య కార్యకర్త తో మొదలుకుని, పోలీసుల వేధింపులు, జనసేన ఎమ్మెల్యే రాపాక గారి మీద కేసులు బనాయించడం-, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్టులు నరికి వేయడం, జర్నలిస్టులకీ, చట్టాల ముసుగులో సంకెళ్లువేయటం, దుర్గి మండలం లో ఊళ్ళకి ఊళ్ల మొనగాళ్లు లేకుండా ఖాళీ చేయించడం, వారికి ఓటు వెయ్యని ప్రజలని బెదిరించటం, భయపెట్టటం, రహదారి మూసేయడం, సోషల్ మీడియాలో ఎవరు ఒక మాట అన్న కేసులు పెట్టి వేధించటం.. ఊళ్లో భయానక వాతావరణం సృష్టించడం...

4. మానసిక వేదన

విలేజ్ వాలంటీర్ల అని ఐదు లక్షల ఉద్యోగాలు అనౌన్స్ చేసి 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపి; 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టారు, 27 లక్షల భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్ళిపోయారు, ప్రభుత్వ విధానం వలన లక్ష 65 వేల పైగా కాంట్రాక్టు ఉద్యోగులు భవిష్యత్తు గాలిలో, 90 వేలు పైచిలుకు ఉన్న తెలుగు టీచర్లని, ఆంగ్ల మాధ్యమం పేరుమీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగా కొత్తవారిని పెట్టుకుంటారు అనే భయాలు; స్థానిక వ్యాపారవేత్తలు ని పార్టీలని, వేరే కులాలని వేధింపులు, వారు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, పెట్టుబడులు ఆంధ్రకి ఇంక రావు, తద్వారా ఉద్యోగ అవకాశాలు ఉండవు అని నిరుద్యోగులు నిస్సహాయత... ఇలా అనేకం.

5. అనిశ్చితి

ఇన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుందా

కేంద్రం ఏపీకి నిధులు ఇస్తుందా?

నవరత్నాల కి నిధులు ఉన్నాయా?

ప్రభుత్వ ఉద్యోగుల నెలనెల జీతభత్యాలు కి డబ్బులు ఉన్నాయా?

40 వేల కోట్ల పైన అప్పు, పెట్టుబడులు లేవు పెట్టినవి పంపేసారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి?

6. విచ్ఛిన్నం

ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాష భాషని, తెలుగు సంస్కృతి ని, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నతకి శ్రీకారం చుట్టారు....

151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసిపి హానికర ధోరణి ఇకనైనా ఆపాలని కోరుకుందాం...


ఈ ట్వీట్స్ కు వైసీపీ నేతలు స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ జనసేన కేవలం ఒక చోట మాత్రమే గెలిచిందని.. అసలు వాళ్ల పార్టీ లెక్కలోకే రాదంటూ విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: