ఆంధ్ర ప్రదేశ్ జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజాసంక్షేమానికి దోహదపడుతున్న విషయం తెలిసిందే. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో వినూత్న పథకాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన దిశగా అడుగులు వేసేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రజలు ఎవరు మద్యం బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వైన్ షాపులు అన్నింటినీ మూసివేయించిన ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతోంది. అయితే ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులను క్రమక్రమంగా కుదిస్తూ  సంపూర్ణ మద్యపానం దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

 


 అంతే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులు సమయాన్ని కూడా కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. కేవలం రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక తాజాగా బార్ల  సంఖ్యను కురుస్తుంది నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బార్ల నిర్వహించే సమయాన్ని  కూడా తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మద్యం ధరలను భారీగా  భారీగా పెంచారు. అయితే బార్లలో విక్రయించే మద్యం  ధరలను భారీగా పెంచింది ఏపీ ప్రభుత్వం. కాగా ఈ ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి . అన్ని బార్లలో  స్వదేశీ బ్రాండ్ల మద్యంపై కనిష్టంగా 30 రూపాయలు గరిష్టంగా  750 రూపాయలు పెరిగింది. అంతేకాకుండా మినీ బీర్లపై  30 రూపాయలు పెంచుతూ  నిర్ణయం తీసుకోగా...  పెద్ద బీర్లపై   60 రూపాయలు పెంచింది . 

 

 

ఇక రెడీ  టు డ్రింక్ పేరిట విక్రయించే 250, 270 ఎమ్మెల్ బాటిల్ లపై 60 రూపాయల  పెంచగా... ఐఎంఎఫెల్ క్వార్టర్ పై  కూడా 60 రూపాయలు పెంచింది.  ఇక హాఫ్ బాటిల్ పై 120 రూపాయలు... ఫుల్ బాటిల్ పై 240 రూపాయలు ధరలను పెంచింది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం సంపూర్ణ మద్యపానం దిశగా అడుగులు వేస్తూ భారీగా మద్యం ధరలను పెంచుతుండటంతో  ఏపీ మందుబాబులకు ప్రభుత్వం షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. పెరిగిన భారీ మద్యం ధరలతో  సామాన్యుడు మద్యం వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. కొంతమంది భారీగా పెరిగిన మద్యం ధరలకు భయపడి మద్యం వైపు వెళ్లాలంటేనే  భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా భారీగా మద్యం ధరలు పెంచేసి ప్రజలందరికీ మద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: