రోజురోజుకు వ్యభిచార వృత్తి ఎక్కడ చూసినా పెరిగిపోతుంది. యువతులను మాయమాటలు చెప్పి నమ్మించి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు . దీంతో ఎక్కడ చూసినా వ్యభిచార వృత్తి దర్శనమిస్తోంది. వ్యభిచార వృత్తి చేయడంలో కూడా విభిన్న రీతులలో ఎంచుకుంటున్నారు. కొంతమంది పెద్ద పెద్ద హోటల్స్ లో వ్యభిచార వృత్తిని సాగిస్తున్నారు. వ్యభిచార వృత్తి మానేయాలని ప్రభుత్వాలు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టిన కూడా వ్యభిచార వృత్తి రోజురోజుకు ఎక్కువవుతోంది కానీ  తక్కువ అవడం లేదు. అయితే ఎవరి కంటపడకుండా వినూత్నంగా ఆలోచిస్తూ వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారు. స్పా లు మసాజ్ సెంటర్లు  హోటళ్లు అంటూ వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారు. 

 

 అయితే ఇప్పటికే ఇలాంటి సెక్స్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. తాజాగా మరో ముఠా గుట్టు రట్టయింది. విజయవాడలో పోలీసులు చాకచక్యంగా సెక్స్ ముఠాను పట్టుకున్నారు. బెజవాడలో కొందరు స్పా మసాజ్ సెంటర్ల పేరుతో యువతులతో వ్యభిచారం నడిపిస్తున్నారు. ఎవరికి తెలియకుండా స్పా,  మసాజ్ సెంటర్లు నడుపుతున్నట్టు గా బయటికి కవరింగ్ ఇస్తూ లోపల మాత్రం యథేచ్ఛగా  వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. అయితే సెక్స్ రాకెట్ ముఠాలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు... ఒకేసారి మూకుమ్మడిగా రైడింగ్ చేశారు. దీంతో సెక్స్ ముఠా గుట్టు రట్టయింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకొని అందులో స్పా మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్పా మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. 

 

 మసాజ్ సెంటర్లు స్పా లపై దాడులు నిర్వహించిన పోలీసులు పలువురు యువతులు నిర్వాహకులను విటులను  అదుపులోకి తీసుకున్నారు. కాగా  దీనిపై విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ... స్పా ల  పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీంతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే రోజురోజుకు వ్యభిచార వృత్తి పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఖరీదైన భవనాలను  అద్దెకు తీసుకొని అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా సెక్స్ రాకెట్ ముఠా ను  నడిపిస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు ఎన్నో  సెక్స్ రాకెట్ ముఠాలను పట్టుకున్నప్పటికి కూడా రోజుకో కొత్త సెక్స్ రాకెట్ ముఠా వెలుగులోకి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: