ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం వంటి బేధాలు ఉండవని అందరూ అంటారు. ఇప్పుడు మరొకసారి మళ్లీ ఈ విషయాన్ని మన తెలుగు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన డాక్టర్ విజయ కుమార్‌ నిరూపించారు. ఖండాంతరాలు, దేశాలు దాటైనా తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. ఇవన్నీ వినడానికి సినిమా డైలాగుల్లా అనిపించొచ్చు కానీ, అప్పుడప్పుడు రియల్ లైఫ్‌లోనూ ఇలా జరుగుతుంటాయి. తాజాగా ఓక జంట ప్రేమ ఖండాంతరాలు దాటింది. స్పానిష్ అమ్మాయి, అనంతపురం జిల్లా అబ్బాయిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది.

 

ఇక పూర్తి వివరాలలోకి వెళితే తాడిపత్రికి చెందిన డాక్టర్ విజయకుమార్‌ బత్తల పల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. స్పెయిన్‌‌ కి చెందిన కార్లా కూడా అక్కడే డెంటిస్ట్. ఈమె కూడా ఆర్డీటీ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వాళ్లిదరు ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వీరిద్దరు. ఇదే విషయాన్ని పెద్దలకు కూడా చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. తాడిపత్రి లో వీరి పెళ్లి హిందూ సంప్రదాయంలో ఘనంగా జరిగింది.

 

మన మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా ఇలాంటిదే జరిగింది. ఈ విషయానికి వస్తే ములుగు జిల్లాలకు చెందిన యువకుడు ఆస్ట్రేలియా యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ములుగు జిల్లాకు చెందిన ఉమామహేశ్వర్‌ రావు కుమారుడు దినేష్‌ ఆస్ట్రేలియాలో ఫార్మాలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న డెమినితో పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరు కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. ఇంకేముంది ఇద్దరు హన్మకొండలో తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు బంధువులంతా హాజరయ్యి దంపతులను ఆశీర్వదించారు

మరింత సమాచారం తెలుసుకోండి: