ఈమధ్య యూట్యూబ్ అందర్నీ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఏ విషయం గురించి నేర్చుకోవాలన్న యూట్యూబ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే చాలామంది యూట్యూబ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు నేర్చుకునేవారు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. సినిమాల్లో పెట్టుబడి పెట్టడం కోసం యూట్యూబ్ లో దొంగ నోట్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. కానీ చివరికి కటకటాలపాలయ్యాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట కు చెందిన సామల శ్రీనివాస్ మహబూబ్నగర్ జిల్లా గంగవరం మండలం పాలంపేట ఆరెంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. అయితే శ్రీనివాస్ పెద్దకొడుకు రాంచరణ్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే సాయి చరణ్ తో సినిమా రంగం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతూ సినిమా రంగం వైపు వెళ్ళాడు. షార్ట్ ఫిలిం ప్రైవేట్ ఆల్బమ్ లో తీసేవాడు. 

 

 

 

 టాలీవుడ్  నిర్మాత బండ్ల గణేష్ వద్ద పనిచేసే పేట శ్రీనివాస్ ద్వారా సాయిచరణ్ కు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం కలిగింది.అయితే దీనికోసం  సినిమాలో కొంత పెట్టుబడి పెట్టాలని  శ్రీనివాస్ కు సూచించారు. దీంతో  శ్రీనివాస్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు.  దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకున్న శ్రీనివాస్ నకిలీ నోట్లు ముద్రించేందుకు నిర్ణయించాడు. దీనికోసం పక్క పథకం వేసి యూట్యూబ్ లో నకిలీ నోట్లను ఎలా ముద్రిస్తారో  వీడియోలు చూసి నేర్చుకున్నాడు. పథకం ప్రకారం కలర్ ప్రింటర్స్ రెవిన్యూ స్టాంప్ ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసి  200, 500, 2000 రూపాయల  నకిలీ నోట్లు తయారు చేయడం మొదలు పెట్టేసాడు. అయితే ముద్రించిన నోట్లను ఎలా మార్చాలి  అని ఆలోచించిన శ్రీనివాస్ నకిలీ నోట్లను పట్టణాల్లో మారిస్తే అందరు గుర్తుపడతారు కాబట్టి గ్రామాల్లో వాటిని చలామణి చేయటం  మొదలు పెట్టాడు.

 

 

 

 మూడు నెలల నుంచి ఓ వాహనంలో వరంగల్ ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తెగ  తిరుగుతూ నకిలీ నోట్లను చలామణి చేయడం ప్రారంభించాడు ఆ వ్యక్తి. ఇందులో భాగంగానే  ఈనెల 19న మహబూబ్నగర్ జిల్లాలో ఓ బెల్ట్ షాప్ వద్ద  500 రూపాయల నకిలీ నోటును మహిళ వద్ద మార్చేందుకు ప్రయత్నించాడు  శ్రీనివాస్. అయితే శ్రీనివాస్ తీరుపై అనుమానం వచ్చిన ఆ మహిళల అది నకిలీ నోట్లను గుర్తించడం దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.  కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు... వాహనంలో వెళుతున్న సామల శ్రీనివాస్ భార్య నాగలక్ష్మి కుమారుడు సాయి చరన్ అఖిల్  ను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరినుండి  ఏకంగా 60, 900 నకిలీ నోట్లు 29, 870 అసలైన నోట్లను  స్వాధీనం చేసుకున్నారు. వారందరిని కటకటాల వెనక్కి నెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: