ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీ కూటమి మహారాష్ట్రలో బలంగా ఉన్నది.  సోనియాకు చెప్పకుండా ఎన్సీపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసేందుకు సాహసించలేదు.  శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పుడు కూడా శరద్ పవార్ ఢిల్లీ వెళ్లి సోనియాతో మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకున్నాడు.  శివసేనను నమ్మించారు.  అటు కాంగ్రెస్ పార్టీకి ప్రీతిపాత్రమైన పార్టీగా ఉన్నది.  ఇలా ఎవరికీ అనుమానం రాకుండా ఎన్సీపీ పావులు కదిపింది.  


ఇటు శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దగ్గరవుతూనే... బీజేపీతో బేరసారాలు నడిపింది.  బీజేపీ కూడా మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై స్పష్టంగా ఉన్నది.  ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్న తరుణంలో ఎన్సీపీతో కలిసి శివసేన, కాంగ్రెస్ పార్టీలు చర్చలు జరిపాయి.  ఈరోజు గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన విషయాలను మాట్లాడుదామని అనుకున్నది. 


ఈలోగా ఈ ఉద్దయం 5:27 గంటలకు గవర్నర్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.  ఇలా ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  అటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  ఇలా అంతా జరిగేంత వరకు ఎవరికీ అనుమానం రాలేదు.  అనుమానమే కాదు. అసలు ఇలా జరుగుతుంది అనే చిన్న ఆలోచన కూడా బయటకు రాకపోవడం విశేషం.  


బీజేపీని ఎదిరించిన శివసేనకు ఎలా చెక్ పెట్టాలో అలా చెక్ పెట్టింది.  శివసేనకు లోకల్ పార్టీ ఎన్సీపీతోనే చెక్ పెట్టించింది. ఏదైనా ఉంటె ఆ రెండు పార్టీలే చూసుకుంటాయి.  తనకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ మారిపోయింది.  దేశంలోనే కాదు.. రాష్ట్రాల్లో సైతం ఏదైనా తేడా వస్తే.. ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటాం అని దీనిద్వారా బీజేపీ చెప్పకనే చెప్పింది.  మహారాష్ట్రలో జరిగిన పరిణామాలతో రాష్ట్రాలు భయాందోళనలో ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: