మహారాష్ట్ర రాజకీయంలో మరో మలుపు అలాంటి ఇలాంటి మలుపు కాదు ఇది సినిమా తరహాలో జరిగిన మార్పు. నిన్నటి వరకు ఉద్ధవ్ ఠాక్రే నే సీఎం గా అనుకున్నాను ఎన్సీపీ ఉన్నటుండి ప్లేట్ ఫిరాయించింది. రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రి గా శరద్ పవార్ అధినేత మేనల్లుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మహారాష్ట్ర లో విధించిన రాష్ట్రపతి పాలనను తొలగించారు. 

రాత్రికి రాత్రి ఏం జరిగింది? మహా డ్రామా కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శరద్ పవార్? 

చివర్లో ప్లేట్ ఫిరాయించి బీజేపీ కి మద్దతు తెలిపిన అజిత్ పవార్ శరద్ పవార్ కు స్వయానా మేనల్లుడు కావడంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కాదని అజిత్ ఈ సాహసం చెయ్యడు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ డ్రామా మొత్తానికి శరద్ పవార్ దర్శకత్వం వహించారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయ్. శివసేన ను తప్పు దారి పట్టించడానికి శివసేన నేత సంజయ్ రౌత్ ను శరద్ పవార్ వాడుకున్నారని తెలుస్తోంది. బీజేపీ తమ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సీఎం సీట్ 50:50 ఇవ్వాలని శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీ ని కోరారు దీనికి నో చెప్పిన బీజేపీ శివసేన ను దూరం పెట్టింది. ఇక రంగంలోకి దిగిన శరద్ పవార్ తెర ముందు ఒక మాట తెర వెనుక ఒక మాట తో శివసేన ని బకరా చేసి బీజేపీ తో చీకటి ఒప్పందం చేసుకుని తన మేనల్లుడికి డిప్యూటీ సీఎం ఇస్తే తమ 54 మంది ఎమ్యెల్యే ల మద్దతు ఇస్తామని చెప్పడం దీనికి బీజేపీ ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. ఇంత జరిగినా శరద్ పవార్ మాత్రం పైకి ఈ విషయం నాకు తెలీదు అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: