ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోన్న జగన్ సర్కార్, మద్యం రేట్లను అమాంతం పెంచింది. ఇప్పటికే బార్ల లైసెన్స్ లను కూడా రద్దు చేయగా, స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్స్ లు కూడా రద్దు కానున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు కొత్త మద్యం విధానాన్ని కూడా తయారు చేశారు. ప్రస్తుతం అన్ని రకాల ఇండియన్ మేడిన్, ఫారిన్ లిక్కర్ పై కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.750 వరకు పెరిగాయి. చిన్న బీర్లపై కూడా రూ.30, పెద్ద బీర్లపై రూ.60 వరకు పెంచారు. రెడీ టూ డ్రింక్ 250/275 ఎంఎల్ కు కి కూడా రూ.60 పెంచారు.

 

ఇక విదేశీ మద్యంపై  50 నుంచి 60 ఎంఎల్ కు రూ.30, 200/275 ఎంఎల్ కు రూ.60, 330 నుంచి 500 ఎంఎల్ వరకు రూ.120, 700/750 ఎంఎల్ కు రూ.240 పెంచారు. ఇక పెరిగిన బీర్ల ధరలు 330 ఎంఎల్ కు రూ.30, 500 ఎంఎల్ కు రూ.30, 650 ఎంఎల్ కు రూ.60.

 

ఇలా ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన మద్యం ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో దశల వారీ మద్య నిషేధం భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. బార్ల సమయాలలో మార్పు చేసింది.

 

ఇదే సమయంలో బార్ల ద్వారా జరిగే మద్యం విక్రయాల ధరలను భారీగా పెంచుతూ కేటగిరీల వారీగా ఎంత మొత్తంలో పెంచాలో నిర్ణయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కొత్త బార్ల విధానం మేరకు లాటరీ ద్వారానే కొత్త వారిని ఎంపిక చేస్తారు. ఇక, దరఖాస్తు ఫీజును రూ 10 లక్షలుగా ఖరారు చేశారు. బార్లలో మద్యం అమ్మకం సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పరిమితం చేశారు.

 

దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు..వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం, బార్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్‌ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు.

 

బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్, ఆ పై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్‌ చేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: