మహారాష్ట్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి... అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సంపాదించింది. దీంతో మొదట బిజెపి శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని మహా రాష్ట్ర ప్రజలు అందరూ భావించారు. కానీ ఇంతలో  శివసేన తమ పార్టీ నాయకుడికి సీఎం సీటు కావాలనే  డిమాండ్ ని తెర మీదికి తెచ్చింది. దీనికి  బిజెపి నిరాకరించడంతో బీజేపీతో శివసేన పోతును  విరమించుకుంది. దీంతో మహా ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఇక అప్పటి నుంచి మహా రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతుంది. రోజుకో కొత్త ట్విస్టు తెర మీదికి వస్తుంది. శివసేన ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ నాయకుడిని సీఎం సీటులో కూర్చోబెట్టాలని ఎన్సీపీ కాంగ్రెస్ తో తీవ్ర కసరత్తు చేసింది. 

 

 

 

 అయితే శివసేన ఎన్సీపీ  కాంగ్రెస్ పొత్తు కుదిరినట్లు అనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. శివసేన పార్టీ నాయకుడే మహారాష్ట్రకు తర్వాత ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటున్న తరుణంలో... బిజెపి పార్టీ శివసేన పార్టీపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడింది. రాత్రికి రాత్రే మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు మార్చేసింది . మహా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం అర్ధరాత్రి సీక్రెట్ గా జరిగిపోయింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకరం చేశారు. అయితే  నిన్నటి వరకు కాంగ్రెస్ శివసేన తో చేతులు కలిపిన ఎన్సీపీ పార్టీ రాత్రికి రాత్రే పార్టీలో చీలిక రావడం తో ప్లేట్ తిప్పేసింది. బీజేపీకి మద్దతు ప్రకటించింది. 

 

 

 

 దీంతో మహారాష్ట్రలో  బిజెపి ఎన్సీపీ  ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎవరు ఉహించి ఉండరు . అయితే రాజకీయాల్లో  ఎవ్వరు ఊహించని  విధంగా  బిజెపి ఎన్సీపీ  ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ విషయం తెల్లారే వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది బీజేపీ . సరికొత్త వ్యూహం తో శివసేన రాజకీయాలకు బిజెపి చెక్  వేసినట్లయింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోషియారీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దేవేంద్ర ఫడ్నవిస్ ఆహ్వానించడం... ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయింది. నిన్నటివరకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎం అవుతారని అందరూ అనుకున్నారు కానీ రాత్రికి రాత్రే బిజెపి మహారాష్ట్ర సమీకరణాలను మార్చేసి  తెర మీదికి దేవేంద్ర ఫడ్నవిస్ వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. ఇప్పుడు అసలు రాత్రికి రాత్రి ఏం జరిగింది అనే దానిపై మహారాష్ట్రలో చర్చ జరుగుతోంది. బిజెపి అధిష్టానం భారీ హామీలు ఇవ్వడం వల్లే ఎన్సీపీ నేత అజిత్ పవర్ బీజేపీకి మద్దతు తెలిపినట్లు అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: