మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌కు ఊహించ‌ని ట్విస్టిస్తూ..ఎవరూ ఊహంచని విధంగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా,ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ కోశ్యారీ సాక్షిగా వీరిద్ద‌రూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరిలో అజిత్ ప‌వార్ పొలిటిక‌ల్ కెరీర్ అత్యంత ఆస‌క్తిక‌రం. అయితే, ఆయ‌న‌కు తెలంగాణ యువ‌నేత హ‌రీశ్‌రావుకు మ‌ధ్య ఓ కీల‌క పోలిక ఉంది. 

 

ఇదివ‌ర‌కే మ‌హారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవ‌లు అందించిన‌ అజిత్‌ పవార్ మ‌రోమారు ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆయ‌న గెలుపు దేశంలోనే ఓ రికార్డు. ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు ఆయ‌న సొంతం. అంటే డ‌బుల్ హ్యాట్రిక్ కంటే ఓ ద‌ఫా ఎక్కువే గెలుపొందారు శ‌ర‌ద్ ప‌వార్ కుటుంబంలో కీల‌క వ్య‌క్తి అయిన అజిత్ ప‌వార్. ఆయ‌న‌ 1991 నుంచి పుణే జిల్లా  బారామ‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా గెలుస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అజిత్ బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ గెలుపుతో...దేశంలోనే అత్య‌ధిక సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, ఆయ‌న‌కూ... తెలంగాణ‌లో అధికార‌ టీఆర్‌ఎస్ పార్టీ యువనేత హ‌రీశ్‌రావుకు లింకుంద‌ని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట కంచుకోటగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అజిత్ తాజా గెలుపు నాటికి దేశంలో అత్య‌ధిక ఎమ్మెల్యే మెజార్టీ సిద్ధిపేట శాస‌న‌స‌భ్యుడు హ‌రీశ్‌రావు ఖాతాలో ఉంది. ఇటీవ‌లి శాసనసభ ఎన్నికల్లో ఎవరూ సాధించని విధంగా 1,20,650 ఓట్లతో హరీశ్ భారీ విజ‌యం సొంతం చేసుకున్నారు.  హరీశ్ తాజా ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించగా, ప్రతి ఎన్నికకూ మెజార్టీని పెంచుకుంటూ వచ్చారు. అయితే, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అజిత్ బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం..ఈ రికార్డు ఏడో సారి గెలుపొంద‌డం, అధిక మెజార్టీతో...అజిత్ ఖాతాలో చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: