టైటిల్ కొంచెం నమ్మశక్యంగా లేక పోయినప్పటికీ జీన్స్ వేసుకుంటే ఎంత ప్రమాదకరమో ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. అవునండి! 30ఏళ్ల సౌరభ్ అనే వ్యక్తి టైట్ డెనిమ్ జీన్స్ వేసుకుని 8 గంటల సమయం పాటు తన స్నేహితులతో కలిసి ఒక కారులో ప్రయాణిస్తున్నాడు. నిజానికి ఆ కారు ని డ్రైవ్ చేసేది సౌరభ్ శర్మ.. అయితే తాను నడుపుతున్న కారుకు గేర్ సిస్టం లేదు.. అది ఆటోమేటిక్ గా గేర్ మార్చుకునే కారు. దాంతో అతను ఆ నడుపుతున్నా కారుని తన కుడి కాలు పాదంతో ఎక్స్‌లేటర్, బ్రేక్ ని నొక్కుతూ కంట్రోల్ చేశాడు. అస్సలు ఉపయోగించిన అతని ఎడమ కాలు 5 గంటల తర్వాత బాగా తిమ్మిరెక్కి మొద్దుబారిపోయింది.


అంతేకాకుండా ఢిల్లీ కి తిరుగు ప్రయాణంలో అతను ఊపిరి పీల్చుకో లేక బాగా బాధపడ్డాడు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా సౌరభ్ గాలి పీల్చుకోలేగా తెగ ఇబ్బంది పడిపోయాడు. ఈ క్రమంలోనే 2 రోజుల తర్వాత ఆఫీసుకు వెళ్లిన సౌరభ్ మెట్లును ఎక్కుతుంటే...ఊపిరాడక సృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన సహోద్యోగులు సౌరబ్ ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి వారు సౌరభ్ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో.. షాలిమార్ బాగ్ లోని మాక్స్ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు.

అయితే అప్పుడు అక్కడ.. సౌరభ్ కు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నవీన్ భామ్రి... మాట్లాడుతూ.... "అతనికి గుండెపోటు వచ్చింది. టైట్ జీన్స్ వేసుకుని 8 గంటల పాటు ప్రయాణం చేసిన కారణంగా అతని కాలులో ఒత్తిడి బాగా పెరిగిపోయి రక్తం గడ్డ కట్టింది. ఈ గడ్డకట్టిన రక్తం క్రమక్రమంగా ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళానంలో పేరుకపోయింది. ఈ రక్తనాళం పూర్తిగా బ్లాక్ అవ్వడంతో... గుండెకు, బ్రెయిన్ కి రక్తం సరఫరా అవ్వకపోవడంతో.. అతని పరిస్థితి విషమంగా మారింది. అతనిని హాస్పిటల్ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు ఆయన గుండె పల్స్ రేటు నిమిషానికి 10-12 ఉంది. దీనిని వైద్య పరిభాషలో పులమోనరీ ఎంబాలిజం అంటారు" అని వివరించాడు.

సౌరబ్ పరిస్థితి బాగా క్రిటికల్ గా ఉండటంతో.. నలుగురు డాక్టర్లు హుటాహుటిన వచ్చి.. అతనిని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళ్లి ఆయన గుండె సాధారణంగా కొట్టుకునేలాగా చికిత్స చేసారు. 24 గంటల తర్వాత సౌరభ్ స్పృహలోకి వచ్చాడు కానీ అతని బీపీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్న కారణంగా డాక్టర్స్ 5 రోజుల పాటు చికిత్స చేసి ఎట్టకేలకు సౌరభ్ ని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అందుకే ప్రయాణ సమయాలలో టైట్ జీన్స్ ధరించడం చాలా ప్రాణాంతకమని.. .. ఇంకా విశ్రాంతి తీసుకోకుండా ఉండటం మంచిది కాదని వైద్యులు సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: