సర్జికల్ స్ట్రైక్స్ ఈ పదం బీజేపీకి చాలా దగ్గరైంది.  ఏ విషయంలోనైనా సరే సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో బీజేపీ దిట్ట.  అది శత్రువులపై కావొచ్చు.. రాజకీయాలపై కావొచ్చు.  ఎవరిమీదనైనా సరే ఈజీగా దాడి చేస్తుంది.  అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.  ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కావాల్సిన విధంగా మార్చుకొని అన్నింటిని తనవైపు తిప్పుకోవడంతో బీజేపీకి తిరుగులేదు.  ఈ విషయం ఇప్పటికే అనేక మార్పు నిరూపణ జరిగింది.  

గతంలో నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లిన ప్రధాని మోడీ తిరుగు ప్రయాణంలో నవాజ్ షరీఫ్ ను కలిసేందుకు ఇస్లామాబాద్ వెళ్లి షాక్ ఇచ్చారు.  ఎవరూ కూడా ఊహించలేదు.  అప్పటి కప్పుడు సడెన్ గా నిర్ణయం తీసుకొని నవాజ్ షరీఫ్ ను కలిసేందుకు వెళ్లారు.  ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.  దీని తరువాత పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత పాక్ సరిహద్దులు దాటివెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు.  
ఇది అప్పట్లో పెను సంచనలంగా మారింది.  ఆ తరువాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఆర్మీపై దాడి తరువాత ఇండియా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది.  అటు బర్మా బోర్డర్ లో కూడా ఇండియాఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె, కేవలం శత్రువులపైనే కాకుండా బీజేపీ రాజకీయ పార్టీలపై కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది.  నిన్నటి వరకు మహారాష్ట్రలో రాజకీయాలు ఒకలా ఉన్నాయి. 
కానీ, ఈరోజు నుంచి రాజకీయాలు మారిపోయాయి. ఈరోజు ఎలాగైనా గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్న శివసేనకు షాక్ ఇస్తూ బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసింది.  శివసేన.. ఎన్సీపీల కూటమిని చీల్చింది.  ఎన్సీపీని తెలివిగా తనవైపుకు తిప్పుకోవడంలో సఫలం అయ్యింది బీజేపీ. దీంతో ఈ ఉదయాన్నే బీజేపీ - శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: