విజ‌య‌వాడ ప‌విత్ర‌మైన కృష్ణాన‌ది, అమ్మ‌వారి టెంపుల్ ఇలా ఎంతో ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ఊరు. ప్ర‌స్తుతం ఇక్క‌డ జ‌రిగే కొన్ని అసాంఘిక కార్య‌క్ర‌మాల గురించి వింటే మీరు షాకే... అవి ఏంటా అనుకుంటున్నారా.. ప్ర‌స్తుతం ఇక్క‌డ‌ గుట్టుగా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు. బెజవాడలో కొందరు స్పాలు, మసాజ్ సెంటర్ల పేరుతో యువతులతో వ్యభిచారం నడిపిస్తు న్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మసాజ్ సెంటర్ల పై దాడికి దిగారు.  ప్ర‌స్తుతం ఈ విష సంస్కృతి ఏపీ రాజ‌ధాని అయిన అమ‌రావ‌తికి కూడా పాకింది.

 

మసాజ్‌లు, స్పాల పేరుతో నడుస్తున్న వ్యభిచార దందా వెలుగుద‌లోకి వ‌చ్చింది. అందమైన యువతు లతో మసాజ్‌లంటూ నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠాల గుట్టురట్టైంది. జిమ్‌లు, స్పాల పేరుతో అనుమతులు తీసుకుని హైటెక్ తరహా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

పెద్ద పెద్ద మ‌హాన‌గ‌రాల‌ను మించిపోతుంది విజయవాడ. వీధికో స్పా.. సెంటర్‌కో మసాజ్ పార్లర్లు ఏర్పాటవుతున్నాయి. జిమ్‌ల పేరుతో కూడా కొన్ని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరగడంతో విజయవాడ పోలీసులు దాడులు నిర్వహించారు. స్పాలు, జిమ్‌లపై దాడులు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు.

 

 స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా వ్య‌భిచారం జరుగుతున్న‌ట్లు తేలింద‌ని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత స‌మాజంలో యువ‌త ఎటువైపు న‌డుస్తుంది అన్న‌ది ఆలోచించాల్సిన విష‌యం. స్పాలు, జిమ్‌ల పేర్ల‌తో ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో జెన్యూన్‌గా చేసే వాళ్ళ బిజినెస్ కి కూడా ఇది ఒక పెద్ద దెబ్బ త‌గిలిన‌ట్లే అని చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రి పోలీసులు దీని పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌రో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: