మహారాష్ట్రలో ముగింపు అదిరిపోయింది. మహారాష్ట్ర రాజకీయాల ముందు హాలీవుడ్ మూవీ కూడా సరిపోదని చెప్పాలి. ప్రత్యర్థులను కోలుకోకుండా చేశారు కమలనాధులు. తమ వ్యహాలతో ప్రత్యర్ధికి చిక్కకుండా గేమ్ ను భలే ఫినిష్ చేశారు. బీజేపీ రాజకీయాల ముందు శివసేన నిలవలేకపోవడంతో కొన్నివారాలుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు దొరుకుతూ దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రయ్యారు. శనివారం ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ ఖోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

 

నిజానికి ఈ విధంగా జరుగుతుందని జాతీయ మీడియా కూడా అంచనా వేయలేకపోయింది. తెర వెనుక ఇంత రాజకీయం ఎప్పుడు జరిగిందని ఇప్పుడు అందరికీ సందేహాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు. ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్ కోసం వారు పాటుపడతారని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడడం అటు శివసేనను, ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా షాక్‌కు గురిచేసింది. బీజేపీ ఎలాగైనా దిగివస్తుందని చూసీచూసీ ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన శివసేనతో పాటు తమతో సంప్రదింపులు జరిపిన ఎన్సీపీ ఇప్పుడు బీజేపీతో కలవడంపై కాంగ్రెస్, శివసేన రెండూ షాక్ తిన్నాయి.



శివసేన - కాంగ్రెస్ నోట మాట రాలేదంటే అర్ధం చేసుకోవచ్చు .. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో . మరోవైపు శివసేన-ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారేసరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసలైన రాజకీయం. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని శరద్‌ పవార్‌ కలిసినప్పుడే మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని వచ్చిన వార్తలు వచ్చినా తరువాత ఆ ప్రక్రియ నెమ్మదించడంతో కాదనుకున్నారు. కానీ, శనివారం ఉదయాన్ని అనూహ్యంగా ఏకంగా ప్రమాణ స్వీకారమే చేయడంతో పక్కా వ్యూహంతో రాజకీయం సాగినట్లు అర్థమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: