ఐటి ఉద్యోగులకు ప్రజలకు ప్రయాణ భారం  తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను నిర్మించింది. అయితే మామూలు ఫ్లై ఓవర్లలా కాకుండా   భారీ ఎత్తులో ఫ్లైఓవర్లు నిర్మిస్తుంది ప్రభుత్వం. అయితే ఈ మధ్య ఈ ఫ్లై ఓవర్ ను  ప్రారంభించింది కూడా. ఈ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కారణంగా ప్రజలకు ఐటీ  ఉద్యోగులకు ప్రయాణ భారం తగ్గటం   ఏమో కానీ రోడ్లు  ఆక్సిడెంట్లకు నిలయంగా మారుతోంది.ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించి  వారం రోజులే  అయినప్పటికీ ఇప్పటికే ఈ ఫ్లై ఓవర్ మీద   భీభత్సమైన రెండు ప్రమాదాలు జరిగాయి. ఇక ఇప్పుడు తాజాగా బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద   ఘోర ప్రమాదం జరిగింది.  కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ మీద నుండి  పడిపోయింది. ఫ్లై ఓవర్ మీద నుండీ కిందకి  పడిపోయిన ఈ కారు కింద బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఓ మహిళ పై పడడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది అయితే డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు.కాగా  అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

 

 

 ఫ్లైఓవర్ భారీ ఎత్తున నిర్మించడంతో ఫ్లై ఓవర్  నుంచి కింద పడ్డ కారు బీభత్సం సృష్టించింది. సినిమాటిక్ రేంజ్ లో అక్కడ ఆక్సిడెంట్ జరిగింది. కారు అతివేగంతో ఉండడంవల్ల ఫ్లైఓవర్ నుంచి ఎగిరి కింద పడుతు చెట్ల మధ్యనుంచి చొచ్చుకొని  అక్కడే రోడ్డు మీద బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళపై పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు అందరూ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్  ఎక్కువగా మలుపు తిరిగి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడిన రు  పూర్తిగా నుజ్జునుజ్జయింది . ఫ్లై ఓవర్ పైనుండి కారు పడుతున్న ప్రాంతంలో  నాలుగు కార్ల ఉండటంతో  ఆ నాలుగు కార్లు  కూడా ధ్వంసం అయ్యాయి . బయో వర్సిటీ ఫ్లై ఓవర్  ఎక్కువ మలుపులు తిరిగి ఉండటం వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు తిరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

 

 

 

 అయితే డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఐటీ  ఉద్యోగులకు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నిర్మించిన ఈ బయో వర్సిటీ ఫ్లై ఓవర్ కాస్త   ప్రస్తుతం ప్రమాదాలకు కారణమవుతోంది... ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తుంది. అయితే ఫ్లైఓవర్ ప్రారంభించిన వారం రోజుల్లోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. దీంతో ఈ ఫ్లైఓవర్ పై దర్యాప్తు చేపట్టే  అవకాశం కూడా ఉంది. అయితే భాగ్యనగరంలో అభివృద్ధి చెందిన సైబరాబాద్ ఏరియా లో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి.  అయితే ఐటీ  ఉద్యోగులందరూ ఎక్కువగా ఫ్లైఓవర్ మీదనే ప్రయాణిస్తుంటారు. అంతేకాకుండా అయితే ఉద్యోగులందరూ వేగంగా వెళ్లడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ తరచూ ప్రమాదాలు జరిగితే మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అని  పలువురు భావిస్తున్నారు.బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ను  ప్రారంభించిన వారంలోనే రెండు ప్రమాదాలు జరిగితే మరికొన్ని రోజుల్లో ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయి అంటూ బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు .

మరింత సమాచారం తెలుసుకోండి: