మహారాష్ట్రలో రాజకీయం  రంగులు మారుతోంది. రోజుకొక రోజు పరిణామాలు మారుతూ జనాల్లో  ఉత్కంఠను రేపుతున్నాయి. బీజేపీకి మద్దతిచ్చి తన పార్టీల పరంగా హామీ ఇచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పైన పార్టీ అధినేత చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను ఎన్సీపీ లెజిస్టేచరీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా తప్పించారు. ఆయన తో పాటుగా ఎవరైనా బీజేపీకి మద్దతిస్తే అనర్హత వేటు వేస్తామని శరద్ పవార్ ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీకి మద్దతిస్తే వారిపైన అనర్హత వేటు తప్పదని శరద్ పవార్ హెచ్చరించారు. అయితే, అజిత్ పవార్ తనతో సహా మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు లేకుండా చూసుకోవాలంలే 18 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించాల్సి ఉంటుంది. ఇక, శివసేన, ఎన్సీపీ అధినేత మీడియా సమావేశానికి కాంగ్రెస్ గైర్హాజరవ్వటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ సైతం ఈ మూడు పార్టీల అడుగులు నిశితంగా గమనిస్తోంది. ప్రభుత్వం నిలబెట్టకొనే విధంగా పావులు కదుపుతోంది.

       

        ముఖ్యమంత్రిగా అనూహ్య పరిస్థితుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడుతుందా, లేదా అనేది ఇప్పుడు చర్చ. ఫడ్నవీస్ కు గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకు బలం నిరూపించుకోవటానికి సమయం ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం 30న కుప్ప కూలుతుందని శివసేన, ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తమకు మద్దతుగా ఎన్సీపీ ..శివసేన నుండి వచ్చే వారి కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నా..అదే విధంగా ప్రభుత్వం పడగొట్టాలన్నా మహారాష్ట్రలో నాలుగు ప్రధాన పార్టీలు ఇప్పుడు నెంబర్ గేమ్ మొదలు పెడుతున్నాయి. 
.
     

       అనర్హత వేటు నుండి తప్పించుకోవాలంటే అజిత్ పవార్ కు ఎన్సీపీ నుండి 18 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్సీపీకి మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అందులో మూడో వంతు ఎమ్మెల్యేల మద్దతు చీలిక వర్గ నేత అజిత్ కు అవసరం. అయితే, అజిత్ వెనుక 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, సీఎంగా ఫడ్నవీస్ కొనసాగాలంటే సభలో 145 మంది మద్దతు అవసరం. అందులో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, అజిత్ పవార్ తో ఎంత మంది వస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు ఇస్తున్న లీకులు కొత్త చర్చకు కారణంగా మారుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: