ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అనూహ్య పరిస్థితుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రభుత్వం నిలుస్తుందా లేదా అనేది తెలియవలసి ఉంది. ఫడ్నవీస్ కు గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకు బలం నిరూపించుకోవటానికి సమయం ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం 30న కుప్ప కూలుతుందని శివసేన, ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తమకు మద్దతుగా ఎన్సీపీ శివసేన నుండి వచ్చే వారి కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

 


   ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నా..అదే విధంగా ప్రభుత్వం పడగొట్టాలన్నా మహారాష్ట్రలో నాలుగు ప్రధాన పార్టీలు ఇప్పుడు నెంబర్ గేమ్ మొదలు పెడుతున్నాయి. సీఎంగా ఫడ్నవీస్ కొనసాగాలంటే సభలో 145 మంది మద్దతు అవసరం. అందులో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, అజిత్ పవార్ తో ఎంత మంది వస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు ఇస్తున్న లీకులు కొత్త చర్చకు కారణంగా మారుతున్నాయి.

 


    బల పరీక్ష సమయంలో సభలో నెంబర్ గేమ్ చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆ సమయంలో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. ఇప్పుడు సాధారణంగా బీజేపీ నుండే స్పీకర్ ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సభలో హాజరు అయిన సభ్యుల్లో యాభై శాతం కంటే ఎక్కువగా ఒక్క ఓటు వచ్చినా బల పరీక్షలో నెగ్గినట్లే. అయితే, అన్ని పార్టీలు విప్ లు జారీ చేయటం పరిపాటి. ఎన్సీపీ అధినేత తమ ఎమ్మెల్యేల మీద భరోసాతో ఉన్నా..ఈ వారం రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఇక...బల పరీక్ష సమాయానికి ఎన్సీపీ..శివసేన నుండి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే ఇప్పుడు బీజేపీ ధీమాకు కారణంగా ఉంది. దీంతో..స్పీకర్ తీసుకొనే నిర్ణయాలు ఫైనల్ కానున్నాయి. ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్ధుల పాత్ర కీలకం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: