ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువగా అందరి నోట్లో నానుతున్న పేరు నారా లోకేష్. ప్రతి నెటిజన్ పాపం మాలోకం అంటూ, పప్పుసుద్ద అంటూ ఆడుకుంటున్నారు. ఇదే కోవలోకి  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. లోకేష్ పరువు పోయేలా షాకిచ్చారు..

 

 

అదేమంటే తాజాగా డీఆర్సీ సమావేశం నుంచి లోకేష్‌ని బహిష్కరించాలని ఆర్కే తీర్మానం ప్రవేశపెట్టారు. ఇంకేముంది.. అధికార పార్టీ నేతల అంగీకారం తెలపడంతో లోకేష్‌‌ బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఇకపై డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు లోకేష్‌కు అవకాశం లేకుండా పోయింది. ఇదే కాకుండా సీఎం జగన్‌ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

 

అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఓ నిర్ణయాన్ని తీసుకుని నారా లోకేష్‌‌కి  షాకిచ్చారు. అదేమంటే ఈ రోజు గుంటూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో లోకేష్ చేసిన వాఖ్యలపై వాడీవేడి చర్చ జరిగింది. లోకేష్‌ వ్యాఖ్యలను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు.

 

 

అనంతరం డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజార్టీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటు పడినట్టైంది. ఇన్‌చార్జి మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో లోకేష్‌పై వేటు వేయడం గమనార్హం.

 

 

ఇక ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్ళలు గుప్పిస్తున్నారు. ‘‘జగన్ గారిని చూసి రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బై బై ఏపీ అంటున్నాయని ఘాటు వాఖ్యలు కూడా చేసారు.

 

 

ఇదే కాకుండా చంద్రబాబుగారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు మేము తెచ్చాం అని జగన్ గారు బిల్డప్ ఇస్తున్నారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జగన్ గారికి ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయి అనుకోవడం అత్యాశే అవుతుంది అంటు విమర్శించారు.

 

 

ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకున్న నాయకులు లోకేస్‌కు పనిష్మెంట్‌గా ఈ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. పాపం లోకేషా లోకం తెలియని మాలోకం అంటూ ఇప్పుడు జాలిపడుతున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: