తెలంగాణాలో  చేస్తున్న ఆర్టీసీ సమ్మె నలుగురిలో నవ్వులపాలైంది అన్నట్లుగా ఉందని అంటున్నారట కొందరు? సమ్మె వల్ల కార్మికులకు వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. అంతే కాకుండా కొందరు కార్మికులు బలవన్మరణానికి కూడా పాల్పడి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశారు. ఇక సమ్మె పరిస్దితి ఎలా ఉందంటే బాలును ఎంతమంది పట్టుకున్న చివరికి బౌలర్ చేతిలోకి వెళ్లవలసిందే అన్నట్లుగా ఇప్పుడు నిర్ణయం తెలంగాణ ముఖ్యమంతి కేసీయార్ చేతిలోకి వెళ్లింది.

 

 

టూకీగా చెప్పాలంటే పొద్దంతా నగర రోడ్లన్నీ తిరిగిన బస్సులు రాత్రి వేళ డిపోలకు వెళ్లినట్లుగా ఈ పరిస్దితి తెలియచేస్తుంది. ఇక సమ్మెకు సంబంధించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. అదేమంటే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమీక్షలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు..

 

 

ఇక ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపించడమే కాకుండా ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఇదే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటాలకు రేపు ఆదివారం నివాళులు అర్పించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు మానవహారాలుగా ఏర్పడి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతారని ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో ఉన్న అన్ని డిపోల నుంచి మహిళా ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

 

 

కార్మికులు ఎవరు బయపడొద్దని, ప్రైవేటీకరణ చట్టంలో లేదని కాబట్టి ఇది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇక ఈ రోజు అన్ని జిల్లాల్లో ఉన్న కార్మికులు డిపోల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్‌‌‌ ఉమ్మడి జిల్లాల్లో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో ఖమ్మంలో డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికుల్ని పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే తెలంగాణవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె 50 రోజుకు చేరింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: