దేశంలో బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.  బీజేపీ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే.  దానికి ఒక ఉదాహరణ మహారాష్ట్ర రాజకీయాలు.  నిన్న రాత్రి వరకు మహారాష్ట్రలో శరద్ పవార్.. శివసేన.. కాంగ్రెస్ పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  రాత్రి సమయంలో కూడా మీటింగ్ జరిగింది.  ఈ మీటింగ్ లో అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు.  


మరి ఏమైందో తెలియదు.  తెల్లారే సరికి మొత్తం మారిపోయింది.  ఉదయం 5:30 గంటలకు రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు.  రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన కాసేపటికి మొత్తం మారిపోయింది.  దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త ప్రభుత్వానికి ఈనెల 30 వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

 నవంబర్ 30 వరకు బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది.  
కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది కాబట్టి ఇకపై చకచకా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి దిశగా పాలనను నడిపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది.  ఈ వారం రోజుల్లోనే తీసుకోవలసిన అన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అడుగు ముందుకు వేస్తారు. ప్రభుత్వం ఈ విషయంలో తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు మహారాష్ట్రలో చేసిన రాజకీయాలను తెలంగాణలో కూడా అమలు చేయడానికి సదా రెడీ అవుతున్నది బీజేపీ.  ఇప్పటికే బీజేపీ ఈ దిశగా పావులు కదుపుతున్నది.  ప్రస్తుతం తెలంగాణలోని రామగుండంపై కన్నేసింది.  మొదట రామగుండం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడానికి కమలనాధులు పావులు కదుపుతున్నారు.  రామగుండంలో పాగా వేస్తె.. మిగతా చోట్ల కూడా మెల్లిగా పావులు కదుపుతూ.. అనుకున్నవి సాధించాలని చూస్తున్నారు. మరి రామగుండంపై కాషాయం జెండా ఎగురుతుందా.. చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: