ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మత రాజకీయాలు జోరందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సహా  తిరుమల లడ్డూ ధర పెంచడం వ్యవహారంపై  విపక్ష టిడిపి బిజెపి జనసేన పార్టీలన్నీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  మతాన్ని తెరమీదకు తెచ్చి విమర్శలు గుప్పిస్తూన్నాయి . జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే రాష్ట్రంలో తిరుమలకు భక్తులు రాకుండా చేస్తున్నారని అంతేకాకుండా తెలుగు భాషను రూపుమాపేలా  చేస్తున్నారన్న విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై విపక్ష పార్టీలు చేస్తున్న మతపరమైన విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు చేస్తున్న మతపరమైన విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సర్కార్ ఆ బాధ్యతను  మంత్రి కొడాలి నాని కి అప్పగించినట్లు తెలుస్తోంది.

 


 అందువల్లే గత కొంతకాలంగా మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ  ఘాటు విమర్శలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట మతపరమైన విమర్శలను బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించినప్పటికీ ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ మతపరమైన విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చేస్తూనే ఉన్నారు. అయితే స్వతహాగా క్రిస్టియన్ ఆయన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో విపక్ష పార్టీల నేతలు వేరే విషయంలో  విమర్శలు చేయలేక మతపరమైన విమర్శలు చేస్తుండగా వారికీ  కౌంటర్ ఇచ్చిన బాధ్యతను కొడాలి నానికి అప్పగించినట్లు సమాచారం . ఈ నేపథ్యంలో కొడాలి నాని మతపరమైన విమర్శలు చేస్తున్న వారందరికీ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మాటలు తూటాల్లా పేలుస్తూ ఘాటు విమర్శలు చేస్తున్న కొడాలి నాని తీరుపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెబుతున్నా మంత్రి కొడాలి నాని మాత్రం  ఎక్కడ విమర్శల  విషయంలో వెనక్కి తగ్గడం లేదు. 

 

 

 అయితే కొడాలి నాని మాటల తూటాలతో ప్రతిపక్షాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కొడాలి నాని పేరు  తీయటానికి  కూడా ఇష్టపడడం లేదు. అయినప్పటికీ మతపరమైన విమర్శలను గట్టి కౌంటర్ ఇచ్చి ప్రతిపక్షాల నోరుమూయించేందుకు  కొడాలి నాని మాత్రమే  సరైన వ్యక్తి అని  అని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే  డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే... ఈ మాటలు దాడి  కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే అటు మంత్రి కొడాలి నాని మాత్రం తనదైన శైలిలో ఘాటు విమర్శలతో పక్షాలకు  కౌంటర్ ఇస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: