సుజనాచౌదరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అంటారు. అటువంటి ఆయన హఠాత్తుగా ఈ ఏడాది జూన్లో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన కప్పుకోవడమే తడవుగా బీజేపీలో పుట్టి పెరిగిన నాయకులందరికంటే కూడా ధాటీగా మాట్లాడుతున్నారు. తాను బీజేపీలోనే రాజకీయ అక్షరాభ్యాసం చేశాను అన్న తీరున బిల్డప్ ఇస్తున్నారు.

 

ఇక సుజనాచౌదరి  ఏపీకి సంబంధించి మాట్లాడితే చాలు జగన్ మీద విరుచుకుపడుతున్నారు. జగన్ కి పాలన చేతకాదని హేళ‌న చేస్తున్నారు. ఏపీలో అభివ్రుద్ధి ఆగిపోయిందని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.  జగన్ కులాలు, మతాలు అంటూ రాష్ట్రాన్ని విడదీశారని కూడా అంటున్నారు. జగన్ ఎన్నికల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని కూడా నిందిస్తున్నారు.

 

అమరావతిని చంపేస్తారని, పోలవరం ముంచేసారని కూడా సుజనాచౌదరి విసుర్లు విసురుతున్న సంగతి విధితమే. ఇదిలా ఉండగా సుజనాచౌదరి వైసీపీలోకి వస్తారని అంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు. నిజంగా ఇది సంచలనమైన కామెంటే మరి. బాబు సన్నిహితుడిగానే సుజనాచౌదరి బీజేపీలోకి వెళ్లారని ఓ వైపు వైసీపీ దుమ్మెత్తి పోస్తున్న వేళ ఆయన వైసీపీలోకి ఎలా వస్తారు.

 

ఇదేమన్న కుదిరే పనేనా అన్న మాటలు కూడా వస్తున్నాయి. అయితే రఘురామక్రిష్ణంరాజు మాత్రం ఇది జరిగే పనేనని అంటున్నారు. అయితే ఇక్కడే ఆయన ఒక  మెలిక పెట్టారు, జగన్ అందుకు అంగీకరించాలని. జగన్ని ప్రతీ రోజూ తిట్టిపోస్తున్న సుజనాచౌదరి విషయంలో ఆయన ఎందుకు ఓకే చెబుతారు. మరి ఈ లాజిక్ తెలిసేనా రాజు ఇలా మాట వదిలారు అని కూడా అంటున్నారు. జగన్ ఎటూ ఒకే అనరు కాబట్టి సుజనాచౌదరి వస్తారని చెబుతున్నారనుకోవాలేమో

 

ఇక సుజనా చౌదరి విషయం తీసుకుంటే జగన్ తో ఆయన‌కు గతంలో పరిచయాలు ఉన్నాయని అంటారు. జగన్ ఎంపీగా ఉన్నపుడు కూడా సుజనా చౌదరి ఆయన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే స్నేహాలు వేరు రాజకీయాలు వేరు అన్నది కూడా ఎవరూ మరవకూడదు. మరో వైపు చూసుకుంటే సుజనాచౌదరి బీజేపీని వదలి ఎందుకు వస్తారన్నది కూడా పెద్ద ప్రశ్న. 

 

 

రఘురామక్రిష్ణంరాజుని బీజేపీలోకి  వస్తారని సుజనాచౌదరి అన్నారు కాబట్టి ఈయన కూడా ఆయన వస్తారని అనేస్తున్నారనుకోవాలేమో. ఏది ఏమైనా రాజకీయాలు అంటే ఒక్కలా ఉండవు. అవి ఎటునుంచి ఎటైనా మారవచ్చు. అన్నం తిన్న వాడు ఎవడైనా వైసీపీలో చేరుతారా అన్న వల్లభనేని వంశీ టీడీపీని వదిలేసినపుడు సుజనాచౌదరి విషయం కూడా డౌటేగా మరి. సుజనాచౌదరి జగన్ మీద ఇంత తీవ్రంగా ఎపుడూ కామెంట్స్ చేయలేదు కూడా.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: