మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా ముగియలేదు. సరికొత్త అంకానికి చేరుకున్నాయి. హఠాత్తుగా తెల్లవారు జామున రాష్త్రపతి పాలన ఎత్తేయించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో విపక్షాలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. తక్షణం ఫడ్నవీస్ ని తన  బలం అసెంబ్లీలో  నిరూపించుకోవాలని ఆదేశించమని కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. దీంతో ఆదివారం అయినా కూడా సుప్రీం కోర్టు ఈ కేసు విచారణకు స్వీకరించింది.

 

ఈ రోజు ఉదయం పదకొండున్నరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు  విచారణ చేపడతారు. ఎన్సీపీ, శివసేన, బీజేపీ కూటమి కోర్టులో వేసిన ఈ పిటిషన్లో ఈ రోజే ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించాలని సుప్రీం కోర్టుని కోరుతున్నాయి. మరో వైపు మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు మరోసారి  మొదలయ్యాయి. మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటున్నాయి. అందుకే రిసోర్టులకు, హొటళ్ళకు  వారిని సేఫ్ గా తరలిస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించిన ముంబైలోని రిసైసన్స్ హొటల్ కి శరద్ పవార్ నేషనలిస్ట్  కాంగ్రెస్  పార్టీ తన ఎమ్మెల్యేలను తరలించింది. ఓ విధంగా ఇది ఆ పార్టీ సెంటిమెంట్ గా చూడాలి. కర్నాటకలో కూటమి  విజయం సాధించినట్లుగానే తాము  కూడా విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. మరో  వైపు శివసేన ఎమ్మెల్యేలు  ముంబైలోని లలిత్ హొటల్ ల్లో క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు.

 


దీంతో మహా రాజకీయాలు బాగా  వేడెక్కాయి. ఇక డిప్యూటీ సీఎం  అజిత్ పవార్ వెంట వెళ్ళిన రెబెల్  ఎమ్మెల్యేలలో కొందరు తిరిగి ఎన్సీపీ అధినేత  శరద్ పవార్ గూటికి చేరినట్లుగా చెబుతున్నారు. దీంతో తమ కూటమిని బలం ఉందని, ఫడ్నవీస్ ఒక రోజులోనే బల నిరూపణ చేసుకోవాలని మూడు పార్టీల కూటమి గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలతో మహా పీఠం మళ్ళీ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ చెల‌రేగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: