మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ బలనిరూపణకు ఈనెల 30 వరకు గడువు ఉండడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ , ఎన్సీపీ, శివసేన చర్యలు ప్రారంభించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ కు తరలించింది.

 

 

భోపాల్ లోని హోటల్ లో వారికి శిబిరం ఏర్పాటు చేసింది. ఎన్సీపీ కూడా అందుబాటులో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తరలించింది. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలను కూడా తరలించనుంది. అటు ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా శివసేన కూడా తమ పార్టీ శాసనసభ్యులను ఇతర రాష్ట్రాలకు తరలించే అవకాశం కనిపిస్తోంది.

 

అజిత్ పవార్ తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫడ్నవీస్ బలనిరూపణపై ధీమాగా ఉన్నారు. అయితే ఆయన అంత ధీమాగా ఉన్నా పరాభవం పొందే అవకాశాలు పోంచి ఉన్నాయి. అజిత్ పవార్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145. ఆ మార్కు అందుకునేందుకు అజిత్ పవార్ వెంట కనీసం 45 మంది వరకూ ఉండాలి.

 

అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు అజితే వెంటే రావాలి. అప్పుడు బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అదే జరిగితే మరాఠా యోధుడిగా పేరున్న శరద్ పవార్ ప్రతిష్ట మంటగలిసినట్టే.. మరికొందరు ఇండిపెండెంట్లు కూడా బీజేపీని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. శరద్ పవార్ కనుక గట్టిగా పట్టుబడితే.. బీజేపీ బల నిరూపణ అంత సులభం కాకపోవచ్చు. అయితే బీజేపీ అంత సులభంగా ఓటమి అంగీకరించే అవకాశాలూ తక్కువే. బలపరీక్ష నాటికి ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో మహారాష్ట్ర రాజకీయాల్లో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: