ఇండియాలో ఉన్న అక్రమార్కులు విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ వెనక్కు తెప్పించి పేదల ఖాతాలో వేస్తానని ఎప్పుడో ఓ పెద్దాయన అయిన మోదీ మాట ఇచ్చారు. ఇప్పటికి ఆ డబ్బు ఎప్పుడెప్పుడు తమ అంకౌంట్లో పడుతుందా అనికి కాటికి వెళ్లే ముసలివాళ్లు కూడా యమున్ని కాసేపు ఆగమని మోదీ వేసే డబ్బులకోసం ఎదురుచూస్తూన్నారట. ఇలా ఉంది కధ. ఆయన ఆ డబ్బు వెనక్కి తేరు. పేదల అకౌంట్లో డబ్బులు వేయరు. ఇక ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లో వేయలేదని విపక్షాలు కూడా నిత్యం విమర్శిస్తుంటాయి. అయితే ఒక్క మధ్యప్రదేశ్ కు  చెందిన హుకుం సింగ్ అనే వ్యక్తి ఖాతాలో మాత్రం మోదీ నిత్యం డబ్బులేస్తున్నారట..

 

 

మోదీ వేస్తున్న డబ్బులను ఆ వ్యక్తి వాడుకుంటున్నారట. ఇంతకు వారిద్దరికి మంచి దోస్తాన్ ఉందికావచ్చూ అనుకునేరు. కానే కాదు. మరేంటో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలోని రురై గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు  భారతీయ స్టేట్‌బ్యాంక్‌లో ఒకే శాఖలో ఖాతా తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు. అయితే.. వారిలో ఓ హుకుం సింగ్ తన అకౌంట్లో నెలనెలా డబ్బులేస్తుంటే అవి రెండో హుకుం సింగ్ అకౌంట్లో పడుతున్నాయి.

 

 

వాటిని ఆయన దర్జాగా వాడుకుంటున్నాడు. తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసి రెండో హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని సంబరపడ్డాడు. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయలు డ్రా చేసుకున్నాడు. అయితే ఇటీవల డబ్బులు అవసరమైన అసలు హుకుం సింగ్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా అందులో రూ.35 వేలు మాత్రమే ఉండడంతో లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు.

 

 

అప్పటికి గానీ చేసిన పొరపాటును అధికారులు గుర్తించలేక పోయారు. తప్పును గుర్తించిన అధికారులు డబ్బులు వాడుకున్న మరో వ్యక్తిని పిలిచి అసలు విషయం చెప్పి డబ్బుల కోసం ప్రశ్నించారు. దీంతో తనకేమీ తెలియదని. మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానని హామీ ఇచ్చాడు కదా. అందులో భాగంగానే డబ్బులు పడుతున్నాయని భావించి అవి తాను వాడుకుంటున్నానని చావు కబురు చల్లగా చెప్పాడట. అదివిన్న అక్కడి వారికి బుర్ర గిర్రున తిరిగిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: