మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ త్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఎవరికీ అంతు చిక్కని ట్విస్టులతో బీజేపీ .. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంది. సడి చప్పుడు లేకుండా తెల్లారేసరికి ఫడ్నవిస్ సీఎం అయిపోయారు. అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకూ పూర్తి కాలం పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారు లేరు.మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినోళ్లు ఐదేళ్ల కాలం సీఎంగా ఉన్నోళ్లు లేరు. ఎవరు సీఎం పదవిని చేపట్టినా.. అయితే రెండేళ్లు.. లేదంటే మరో ఏడాదే తప్పించి.. ఐదేళ్లు సంపూర్ణంగా పదవీ కాలంలో ఉన్నోళ్లు లేరు.

 

కానీ ఫడ్నవిస్ మాత్రం ఎవరికీ అందని రికార్డు ను స్వంతం చేసుకున్నారు. ఈ మాటను బ్రేక్ చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ఐదేళ్ల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా.. అనూహ్యంగా సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెర మీదకు వచ్చింది. నాటకీయ పరిణామాల్లో సీఎం అయిన ఆయన పూర్తికాలం కొనసాగుతారా? అన్న సందేహాలకు తెర దించుతూ ఐదేళ్లు ముఖ్యమంత్రి గా వ్యవహరించి... గతంలో ఎవరికి సాధ్యం కాని రికార్డు ను నెలకొల్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక.. మళ్లీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర మహారాష్ట్రలో ఇప్పటివరకూ లేదు.

 

మహారాష్ట్రలో మొదటి నుంచి కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం ఆనవాయితీ. దానితో ఏ పార్టీ నేత కూడా పూర్తి కాలం పదవిలో ఉన్న దాఖలాలు లేవు. ఆ రికార్డు ను సైతం బ్రేక్ చేశారు ఫడ్నవీస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలు ఉంటే కేవలం 105 స్థానాల్లోనే బీజేపీ విజయం సాధించటం.. మిత్రపక్షమైన శివసేన సీఎం పదవిని కోరుకోవటం తో ప్రభుత్వ ఏర్పాటు వెనక్కి వెళ్లింది. తాజాగా ఎన్సీపీలో చీలికను తీసుకు రావటం ద్వారా అజిత్ పవార్ అండ తో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యత చేపట్టిన తొలి సీఎంగా ఫడ్నవీస్ రికార్డు క్రియేట్ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: