ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎంత కష్టమో ఎందుకంటే అన్ని పనులు వారే చేసుకోవాలి. కనీసం బాధ కలిగినప్పుడు. ఏదైన అవసరం ఏర్పడినప్పుడు మాట్లాడాలనుకున్న కష్టమే దాదాపుగా ఒంటరి జీవితం ఎంత కష్టమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో గాని, లేదా సపరేట్ పోర్షన్స్‌లో కాని వారిపిల్లలు ఉంచడం మనం చూస్తూనే ఉన్నాం.

 

 

ఇలాంటి పరిస్దితుల్లో ఏ అర్దరాత్రో ఆపద వస్తే వారు కనీసం ఎవరికైనా చెప్పలేని స్దితిలో ఉంటే అలాంటి వారి పరిస్దితి దయనీయం. ఇప్పుడు ఇక్కడ ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ మహిళ వారు ఉంటున్న ఈ యింటి బాత్ టబ్‌లోనే బందీ అయ్యింది. ఎంతకు బయటకు రాలేకపోయింది. దానికి  కారణం వృద్ధాప్యం. వివరాలు తెలుసుకుంటే ఇంగ్లాండ్‌లోని లౌబరౌ‌లో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్ళింది.

 

 

బాత్ టబ్‌లో కూర్చున్న తర్వాత మళ్లీ పైకి లేవకపోయింది. శరీరం సహకరించకపోవడంతో అందులోనే పాపం బందీ అయ్యింది. ఇంట్లో ఎవరూ ఆమె బాగోగులు చూసేందుకు లేకపోవడంతో సాయం కోసం కేకలు పెట్టలేపోయింది. అలా ఎనిమిది రోజులు ఆహారం లేకుండా బాత్ టబ్‌లోనే ఉండిపోయింది. కేవలం పైపు నుంచి వచ్చే నీటిని మాత్రమే తాగుతూ తన ప్రాణాలను దక్కించుకుంది.

 

 

చివరికి ఆమె ప్రాణాలు కాపాడిన విల్ట్‌షైర్ ఫామ్ ఫుడ్స్ యజమాని సుజీ లీసన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఆమె ఒంటరిగా నివసిస్తుండటం వల్ల రోజు ఆమెతో ఫోన్లో మాట్లాడుతుంటాం. గత కొద్ది రోజులుగా ఆమె మా ఫోన్లకు స్పందించడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో  ఫుడ్ డెలవరీ చేసే వ్యాన్ డ్రైవర్‌ను ఆమె ఇంటికి వెళ్లాలని కోరాం. అతను ఆమె ఇంటికి వెళ్లి లోపలి నుండి తలుపులు గడియ వేసి ఉండటంతో అనుమానం వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమెను పిలవసాగాడు. దీంతో ఆమె స్పందించి.. తాను బాత్ టబ్‌లో చిక్కుకున్నానని, లేవలేని స్థితిలో ఉన్నానని తెలిపింది.

 

 

వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు బద్దలకొట్టి ఆమెను రక్షించారు. ఇకపోతే వారం రోజుల నుండి ఆహారం లేకపోవడం వల్ల ఆమె బాగా నీరసించి పోయింది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోందట.  చూశారుగా సమయానికి ఆ ఫుడ్ డెలవరీ సంస్థ చొరవ చూపి ఉండకపోతే ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారేదోమో ఇలాగే ఉండి ఆకలితో మరణించేదేమో పాపం ఆ వృద్ధురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: