మహారాష్ట్రలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి.  ఎప్పుడు ఎలా జరుగుతుందో.. ఎలా ఉంటుందో తెలియడం లేదు.  ఒకప్పుడు ఒకలా ఉన్న రాజకీయాలు మరొకప్పుడు మరోలా మారిపోతున్నాయి.  ఈ మార్పుకు కారణాం ఏంటి అంటే ఎవరూ చెప్పలేరు. నవంబర్ 22 వ తేదీ రాత్రి నుంచి మహారాష్ట్రలో పరిణామాలు మారిపోవడం.. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. బీజేపీ నేతలు చెప్పినట్టుగానే ఫడ్నవిస్ కు మహా పగ్గాలు అప్పగించారు.  
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారని టాక్ వచ్చినా అందులో నిజం లేదనే విషయం తేలిపోయింది.  అయితే, ఇప్పుడు  శివసేన, పవార్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సుప్రీం కోర్టుకు వెళ్లాయి.  ఈ ఉదయం 11 గంటల సమయంలో దీనిపై జస్టిస్ రమణ బెంచ్ విచారణ జరపబోతున్నది.  ఎలాగైనా సరే తీర్పును తమకు అనుకూలంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మూడు పార్టీలు.  
అయితే, గవర్నర్ ప్రభుత్వానికి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చారు కాబట్టి, ఆ సమయంలోపు నిరూపించుకోవాలని తీర్పు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.  అయితే, అజిత్ పవార్ కు 35 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు.  కానీ, ఆ తరువాత ఎమ్మెల్యేలు శరద్ పవార్ వైపుకు మారడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు.  ఏది ఏమైనా ఈ రోజు ఉదయం 11 గంటల తరువాత మహా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.  
నవంబర్ 30 వరకు సమయం ఇస్తే.. తప్పకుండా బీజేపీ బలాన్ని నిరూపించుకుంటుంది.  అందుకో సందేహం అవసరం లేదు.  అలా కాదు మరో 48 గంటలలో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే ఏం చేస్తారు అన్నది తెలియాలి.  ఒకవేళ 48 గంటల్లో నిరూపించుకోమంటే బీజేపీ నిరూపించుకోగలదా అంటే.. ఏమో ఏదైనా జరగొచ్చు.. రాజకీయాల్లో, క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు అని బీజేపీ నేతలు ఇప్పటికి చెప్తూనే ఉన్నారు.  వారి కాన్ఫిడెంట్ ఏంటో తెలియాల్సి ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: