బాల్ కోట్ లో ఉగ్రవాద స్థావరాలపై రాత్రికి రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు మహా రాష్ట్ర రాజకీయాలపై కూడా బిజెపి రాజకీయ  సర్జికల్ స్ట్రైక్ చేసి రాత్రికి రాత్రి మంతనాలు జరిపి రాజకీయ సమీకరణాలు అన్నింటినీ చెల్లాచెదురు చేసి బిజెపి అభ్యర్థిని  సిఎం సీట్లో కూర్చొ పెట్టిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో ఈ పరిణామం సంచలనం రేపింది. అప్పటివరకు శివసేన కు మద్దతు తెలిపిన ఎన్సీపీ రాత్రికి రాత్రి బీజేపీకి మద్దతు తెలపడంతో ఉదయం 8 గంటల లోపు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనం సృష్టించారు . ఇదే రీతిలో తెలంగాణలో కూడా బిజెపి సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది అంటున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్ తెలంగాణ రాజకీయాల పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 మహా రాష్ట్ర రాజకీయాలపై బిజెపి సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగానే తెలంగాణలో కూడా రాజకీయ మెరుపుదాడి చేసే పరిస్థితి దగ్గర్లోనే ఉంది అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. తాను బాహుబలిని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని... కానీ తన చుట్టూ ఎంత మంది కట్టప్పలు ఉన్నారో  ఒక్కసారి చూసుకోవాలి అంటూ హితవు పలికారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎవ్వరికి అంతుచిక్కని విధంగా ఒక్క రాత్రిలో మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు అన్నింటినీ మార్చి  మోడీ అమిత్ షా లు  మరోసారి దేవేంద్ర ఫడ్నవిస్ ను  ముఖ్యమంత్రిని చేశారు అంటూ లక్షణ్  పేర్కొన్నారు. 

 

 

 త్వరలోనే తెలంగాణపై కూడా బిజెపి రాజకీయ అణ్వస్త్రాన్ని వదులుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం అక్రమ కలయికకు కూడా సిద్ధమైన శివసేనకు మహారాష్ట్రలో బీజేపీ తగిన గుణపాఠం చెప్పిందన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ నిర్వీర్యం చేస్తూ ప్రవేటీకరణ  చేసినట్లుగానే  సింగరేణి సంస్థను కూడా ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలందరూ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు  ప్రజలు గుణపాఠం చెబుతారని విమర్శించారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని  లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ పై  ప్రజల్లో నమ్మకం లేదని... ఒకవేళ కాంగ్రెస్ కి ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టిన వారు అమ్ముడు పోతారనే  అభిప్రాయం ప్రజల్లో ఉంది అంటూ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కాగా ప్రస్తుతం లక్ష్మణ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: