ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ముందుకు సాగుతున్న  విషయం తెలిసిందే.ఇతర  రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా సుపరిపాలన అందిస్తున్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్య  అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నాడు-నేడు అనే కార్యక్రమానికి ఊపిరి పోశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కాలంలో ఇంగ్లీష్ మీడియం లేకుండా ఉద్యోగాలు సంపాదించేందుకు పేద విద్యార్థులు అందరూ ఇబ్బందులు పడకుండా ఉండడానికి ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నమంటూ వైసీపీ మంత్రులు కూడా తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుభాషను మసకబారేలా చేసేందుకే ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపిస్తున్నాయి. 

 

 

 

 ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా  ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష, నదుల పరిరక్షణకు ఉద్యమం చేయడం కోసం కులమతాలకు రాజకీయాలకు అతీతంగా మన నుడి మననది  అనే యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో తెలుగు భాష నిర్వీర్యం కాకుండా కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తలపెట్టిన మననుడి మననది  పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

 

 

 పవన్ కళ్యాణ్ ప్రకటించిన మన నుండి మననది  సినిమా టైటిల్లాగా  అదిరిపోయింది అంటూ వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మన నుండి మననది కార్యక్రమం చేయతలపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ... ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలుపెట్టాలి అంటూ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మీకు ప్యాకేజీ ఇచ్చిన  యజమాని... కృష్ణానదిని పూడ్చి  నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలంటూ ఆందోళన చేయాలని... అప్పుడు నదుల సంరక్షణ సఫలమవుతుంది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: