అవినీతి సొమ్ము అరల్లో దాచిపెడితే అలాచేసిన వారి పాపం పండినప్పుడు అది పుట్టలోని పాములా బయటకు వస్తుంది. చివరికి ప్రభుత్వం దాన్ని సొంతం చేసుకుంటుంది. కాని ఇలాంటి సొమ్ములో కొంత బాగమైన పూటగడవి నిరుపేదలకు ఉపయోగిస్తామని ఇలాంటి అవినీతి పరులు ఎందుకు ఆలోచించరో అర్ధం కాదు. ఒకవేళ ఇలాంటి మంచిపనికి వారు గనుక శ్రీకారం చుడితే సమాజంలో కొంతవరకైన ఆకలి చావులు తగ్గేవేమో. ఇక్కడ దోచుకునే వాడు దోచుకుంటున్నారు. దగా పడేవాడు దగా పడుతున్నాడు. పేదవాడు రోజు రోజుకు నిరుపేద అవుతున్నాడు.

 

 

ఇకపోతే సికింద్రాబాద్‌లో సోదాలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు, పార్క్‌చేసిన రెండు కార్లలో నాలుగు కిలోల బంగారంతోపాటు రూ.1.99 కోట్ల నోట్లకట్టలను స్వాధీనం చేసుకొన్నారు. వివరాల్లోకి వెళ్లితే ఈస్ట్ మారేడ్‌పల్లి షెనాయ్ నర్సింగ్‌హోం సమీపంలోని ఓ నివాస సముదాయంలో పార్క్‌చేసిన కార్లలో నగదు, బంగారం ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో గురువారం ఈ సోదాలు నిర్వహించినట్టు హైదరాబాద్ జోన్ అదనపు డీజీ డీపీ పాండే తెలిపారు.

 

 

ఈ సోదాల సందర్భంగా తొలుత ఒక కారులోని ఆకుపచ్చ రంగు సంచిలో మొత్తం నాలుగు కిలోల బరువున్న 40 బంగారు బిస్కెట్లను గుర్తించామని, మార్కెట్లో వీటి విలువ రూ.1,57,52,000 ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న మరో కారులో సోదాలు నిర్వహించి రూ.1.99 కోట్ల కరెన్సీని గుర్తించామని, ఇదంతా అక్రమంగా బంగారాన్ని విక్రయించి సంపాదించిన సొమ్ముగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

 

ఇకపోతే నిందితులు ఈ సొమ్మును ఎంతో చాకచక్యంగా దాచారని, కారులోని హ్యాండ్ బ్రేక్ ఉండే ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ అర లాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేసుకొని అందులో ఈ నోట్ల కట్టలు పేర్చారని వివరించారు. ఇక ఈ బంగారాన్ని కేరళ నుంచి మైసూరు మీదుగా హైదరాబాద్‌కు రవాణాచేస్తున్న మగ్గురిని అరెస్టుచేసి, కస్టమ్స్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

 

 

చూసారా ఇంత సొమ్ముతో దర్జాగా బ్రతుకుదామనుకున్నారు కాని అంతలోనే ఆ పైవాడు చూసి అవినీతి ఆటకట్టించాడు. ఇలాగే చేస్తున్న వారు ఆ సమాజంలో ఎందరో ఉన్నారు వారందరి దగ్గర ఇంకా ఎన్నికోట్ల ధనం ఉందో అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: