ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా హోం మంత్రి అమిత్ షా దృష్టిలో పడేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఇదేదో బీజేపీ నాయకుల గురించి చెబుతున్నది కాదు. ఏపీలో అధికారం లో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకుల సంగతి ఇది. అవును ఏ చిన్న సందర్భం వచ్చినా అమిత్ షాను పొగడడానికే ఇష్టపడుతున్నారు. విమర్శలు చేసినప్పుడు మాత్రం బీజేపీ మోదీలను లక్ష్యం చేసుకుంటున్నారు. అంతేకానీ అమిత్ షాను మాత్రం పల్లెత్తు మాటనడానికి సాహసించడం లేదు, సరికదా ఏమాత్రం చాన్సు దొరికినా ఆయన దృష్టిలో పడడానికే ప్రయత్నిస్తున్నారు.

 

గత ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి మోడీ ఎంత ముఖ్యమో అమిత్ షా కూడా అంతే ముఖ్యం అన్ని బీజేపీ లో ప్రతి ఒకరికి తెలుసు.జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రయిన తరువాత తొలిసారి దిల్లీ వచ్చినప్పుడే అమిత్ షా దేశం లో నంబర్ 2 ఆయన తలచుకుంటే పనవుతుంది కాబట్టి ఆయన్ను కలిసొచ్చానని చెప్పారు. ఆ తరువాత కూడా ఆయన అమిత్షా తో మంచి సంబంధాలకే ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలో కూడా అమిత్ షా మాటను కాదనేలా నడుచుకోవడం లేదని చెబుతున్నారు.

 

మరో వైపు టీడీపీ కూడా అమిత్ షాని తెగ ప్రేమిస్తుంది. బీజేపీ పై విమర్శలు చేయాల్సి వచ్చినా కూడా బీజేపీ పార్టీ పై ఇంకా ప్రధాని మోదీపై చేస్తున్నారు కానీ అమిత్ షా పేరు ఎక్కడా విమర్శల్లో తీసుకోని రావటం లేదు. తాజాగా చంద్రబాబు అయితే అమిత్ షాని తెగ ప్రశంసలతో ముంచారు. అమరావతి పేరును సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో చేర్చడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన దీని కోసం కృషి చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

 

మొదటగా అమిత్ షాకు ‘ముందుగా ఇండియా మ్యాప్లో చేర్చకుండా ఉన్న అమరావతి పేరును చేర్చేందుకు హోం శాఖ తీసుకున్న చర్యలు భేష్. ఇందుకు కృతజ్ఞతలు. అమరావతిని మ్యాప్లో చేర్చి తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు.’ అని అన్నారు. ఇలాగే పూర్వం కౌరవులు,పాండవులు ఇరువురు కూడా కృష్ణుడు దెగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పేవారు 

మరింత సమాచారం తెలుసుకోండి: