ఈమధ్య స్మోకింగ్ చేయడం అదో పాషన్ గా  మారిపోయింది. ఒకప్పుడు స్మోకింగ్ చేయడం అంటే తప్పుగా భావించే వారు  కానీ ఇప్పుడు మాత్రం స్మోకింగ్ చేయడం అంటే అది స్టైల్ ప్రౌడ్ అన్నట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు రోజురోజుకి పొగతాగే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా పొగతాగే వారి కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలకు కూడా పొగతాగడం స్టార్ట్ చేస్తున్నారు ఈ కాలంలో. పొగ తాగే వారికి ఎక్కువ క్రేజ్ ఉందని నమ్ముతుంటారు నేటి యువత. అంతే మామూలుగా కూడా కాకుండా మరీ ఎక్కువగా పొగ తాగేస్తుంటారు. ఇక పొగతాగే వారి కోసం డిఫరెంట్ డిఫరెంట్ సిగరెట్లను   కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే పొగతాగే అలవాటు ఉన్న వారికోసం ఇక్కడో  కంపెనీ  ఓ ఆఫర్ ప్రకటించింది. జీతం కూడా భారీగానే ఇస్తుందండోయ్ . ఈ కంపెనీ ఇచ్చిన ఉద్యోగంలో పొగతాగే అలవాటు ఉన్నవారు ఏం చేయాలనుకుంటున్నారు. కొత్తగా ఏం చేయాల్సిన పనిలేదు... ఈ కంపెనీ తయారు చేసిన సిగరెట్లు తాగే రివ్యూ రాయాలి. లేదా రివ్యూ వీడియో షూట్ చేయాలి. దీనికి గాను ఈ కంపెనీ ఎంత జీతం చెల్లిస్తున్నదో  తెలుసా... ఏకంగా 2.15 లక్షలు. 

 

 

 

 అమెరికన్ మారిజువానా ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ ప్రకటన చేయగా ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రకటన ఎంతో మంది స్మోకర్లను  తెగ ఆకట్టుకుంటుంది. ఈ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పీల్చి  మీరు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు... అనేది రివ్యూ రాయడం లేదా కెమెరా ఆన్ చేసి వీడియో షూట్ చేయటం చేయాలి. దీనికి గాను ఈ   కంపెనీ  మూడు వేల డాలర్ల జీతం ఇస్తుంది. అది మన దేశ కరెన్సీ లో 2,15, 377 రూపాయలు అన్నమాట. అంతేకాదు ఈ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాల్సి ఉంటుందని సంస్థ నిబంధన పెట్టింది. ఎందుకంటే ఈ సంస్థ కేవలం పొగాకు ఉత్పత్తులనే  కాదు గంజాయి ఉత్పత్తులను కూడా సదరు ఉద్యోగి ప్రయత్నించి రివ్యూ రాయాల్సి ఉంటుంది . అయితే అమెరికాలో గంజాయి వాడకానికి నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం సూచించిన తగిన మోతాదులో మాత్రమే గంజాయిని వాడుతున్నట్లు సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. 

 

 

 

 అయితే తమ సంస్థ చేస్తున్న పొగాకు  తో పాటు గంజాయి  ఉత్పత్తులను కూడా పిలిచి నియంత్రణ కోల్పోకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నిజాయితీగా రివ్యూ రాసే  వ్యక్తులు మాత్రమే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటూ ఈ సంస్థ సూచిస్తోంది. అంతేకాదు ఈ సంస్థ ఇచ్చిన ఉత్పత్తులను వాడిన తర్వాత అనుభూతి ఎలా ఉంది అనేది కెమెరా ముందు చెప్పే  అనుభవం కూడా ఉండాలి. అయితే ఈ ఉద్యోగం చేసే వ్యక్తి ప్రత్యేకంగా ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు నెలకొకసారి ఈ సంస్థ తయారు చేసిన ఉత్పత్తులను ఆ సదరు ఉద్యోగి ఇంటికి పంపించి... రివ్యూలు రాయమని సూచిస్తోంది. అయితే సంస్థ తయారు చేసిన ఉత్పత్తులు పొగాకు గంజాయితో పాటు వెప్స్, సిబిడి ఆయిల్ తో వారికి  తదితర ఉత్పత్తులను కూడా పరీక్షించాల్సి ఉంటుంది.ఇప్జుడు ఈ జాబ్ చేయటం కాస్త కష్టమే అనిపిస్తుంది కదా.  మామూలుగా పొగతాగితేనే  ఏదో ఒక వ్యాధి బారినపడి పై లోకాలకు వెళ్ళి పోతూ ఉంటారు... మరి ఇన్ని  వెరైటీలను వాడితే ఇక బతకగలమా..? అందుకే ఇలాంటి జాబులును  కాస్త అవాయిడ్ చేయడమే బెటర్ సుమీ.

మరింత సమాచారం తెలుసుకోండి: