భార్య భర్తల బంధం విడదీయరానిది అని చెబుతుంటారు. భార్యాభర్తల మధ్య ఎవరైనా వచ్చారు అనుకోండి భార్య ఏ ఏం చేసినా అయినా తన భర్త దక్కించుకోవాలని అనుకుంటుంది. అంతేకాకుండా తమ భార్య భర్తల బంధం మధ్యలోకి ఒకరిని రానివ్వదు కూడా .తన భర్త  దగ్గరికి ఎవరైనా వచ్చారు అనుకోండి ఇక అంతే. కానీ ఇక్కడో భార్య  మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా తాను కట్టుకున్న భర్త కి వేరే మహిళతో పెళ్ళి చేసేసింది. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు. భార్య దగ్గర నుండి భర్తకు మరో మహిళతో పెళ్లి చేసిన ఘటన ఒడిశాలోని మల్కన్ గిరి  జిల్లా మత్తిలిలో చోటుచేసుకుంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తోనే భార్య తన  భర్త పెళ్లి జరిపించింది. నిజానికి అయితే అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు... కానీ బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కుటుంబ పరువు తీస్తాను  బెదిరించడంతో.. పరువు పోతుందనే భయంతోనే కట్టుకున్న భార్య తన భర్తకు ఇంకో మహిళతో పెళ్లికి ఒప్పించింది . ఏకంగా ఈ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కాపురం పెట్టేసారు. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... మత్తిలి పరిధిలోని కుమార్ పల్లి కి చెందిన రామ కావసి  గాయత్రీ లకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అయితే ఇద్దరు దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.రామ కావసికి  కూలి పనులకు వెళ్లే చోట వేరే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఇద్దరి అక్రమ సంబంధం కొన్ని రోజులపాటు కొనసాగింది . అయితే గత కొంత కాలంగా ఆ యువతి రామ కావసి ని తనను  పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అందుకు ఆ వ్యక్తి వద్దకు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ రోడ్డు కేసు పెడతాను  అంటూ బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య తానే స్వయంగా భర్తను సదరు యువతితో పెళ్ళికి  ఒప్పించింది . 

 

 

 

 ఒకవేళ బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించిన భార్య... పరువు పోవటం  కంటే తన భర్తకు సదరు  యువతితో పెళ్లి చేయడమే బెటర్ అని భావించింది. ఈ మేరకు పరువు పోకుండా  ఆ యువతిని పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అంటూ భర్త కు సలహా ఇచ్చింది భార్య. అంతేకాదు సదరు బాధిత యువతితో తన భర్త  పెళ్లి చేయటానికి అత్తా, మామ  కూడా ఒప్పుకోవడంతో సదరు బాధితురాలితో మాట్లాడిన భార్య ఇద్దరికీ పెళ్లి జరిపించింది . ప్రస్తుతం ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కాపురం చేస్తుండడం గమనార్హం. అయితే పెళ్లి అనంతరం సదరు బాధిత మహిళ పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. కాగా  భార్య కట్టుకున్న భర్త కు వేరే అమ్మాయితో పెళ్లి చేయడం స్థానికంగా ఆసక్తిని రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: