టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా తెలుగు మీడియం తీసివేత నిర్ణయం తప్పని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న నేపధ్యంలో అధికార పక్షానికి చెందిన నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు.

 

 

     వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. గతాన్ని అప్పుడే మర్చిపోతే ఎలా విజయసాయి రెడ్డి గారూ 'మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు, కూతలు అన్నీ మీ డైరెక్షన్ లొనే నడిచాయి కదా, మర్చిపోతే ఎలా ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ' అని ఆయన ట్వీట్ చేశారు. అప్పడు తెలుగు భాష కోసం మీ పత్రిక , మీరు గొంతు చించుకుంది ఎలా మర్చిపోయారు అని ప్రశ్నించారు.

 

 

    టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 'ఎందుకింత తెగులు? తెలుగు లెస్సేనా? అంటూ గతంలో తెలుగు కోసం ఉద్యమం చేశారు జగన్ మోహన్ రెడ్డి . ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ గారు నాలుక మడతేసి ఇంగ్లిష్ ఉద్యమం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయారా? అని బుద్ధా వెంకన్న తనదైన శైలిలో నిలదీశారు. ఇక తెలుగు విషయంలో ఒకవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు టీడీపీ, బీజేపీ సైతం జగన్ నిర్ణయం తప్పని చెప్పినా జగన్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్తున్నారు.

 

 

   ట్విట్టర్ లో ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దన్నట్టు ప్రతిపక్ష పార్టీలు మాటల దాడి చేస్తున్నాయని, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. పవన్ తెలుగు భాషను కాపాడాలని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మన నుడి, మన నది. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది అంటూ ట్వీట్ చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: