తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పిదాల్లో ఎన్డీయే నుంచి బయటకొచ్చి వారితో కొట్లాడడం. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబుకు కూడా ఈ విషయం బాగా తెలిసి వచ్చింది. అందుకే ఆయన మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు కొన్నాళ్లుగా ప్రయతనం చేస్తున్నారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడం కూడా అందులో భాగమేనని. వారు అక్కడ చంద్రబాబును బీజేపీ దగ్గరకి చేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని సమాచారం.

 

టీడీపీ నుంచి బీజేపీ లోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక దుబాయిలో ఈ రోజు జరుగుతుంది. దీనికి చంద్రబాబు వెళ్లడం లేదని కూడా తెలుస్తోంది. అయితే టీడీపీ - బీజేపీల నుంచి అనేక మంది కీలక నేతలు అక్కడికి  వెళ్తున్నారు. ఈ కార్యక్రమం దుబాయిలో పెట్టడం వెనుక బీజేపీ - టీడీపీలను దగ్గర చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. అక్కడ రెండు పార్టీల నేతల మధ్య మంతనాలు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. 

 

చంద్రబాబు ప్రతినిధులు కొందరు నాయకులు బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారని చెబుతున్నారు. ఏపీలో కానీ దిల్లీలో కానీ రెండు పార్టీల నేతలు భేటీ అయితే విషయం బయటకు పొక్కుతుంది కాబట్టి ఈ కార్యక్రమం వేదికగా దుబాయిలో మంతనాలు జరిపితే అక్కడ మన మీడియా సమస్య ఉండదు కాబట్టి విషయం బయటకు రాదన్నఆలోచనతో ఈ ఏర్పాటు చేశారంటున్నారు.

 

కాగా ఇండియా మ్యాపులో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చుతూ మార్పులు చేయడంపై చంద్రబాబు అమిత్ షా - కిషన్ రెడ్డిలపై ప్రశంసలు కురిపించారు. జమ్ముకశ్మీర్ విభజన తరువాత విడుదల చేసిన కొత్త దేశ పటాల్లో ఏపీ రాజధానిగా అమరావతిని తొలుత చూపించలేదు... తరువాత టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తడంతో  పాటు హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి మళ్లీ చేర్చారు. దీనిపై చంద్రబాబు ఎవరూ ఊహించని రీతిలో స్పందించి అమిత్ షా కిషన్ రెడ్డిలపై ప్రశంసలు కురిపించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: