పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే నటుడే కాదు ఉద్యమ వీరుడు అనుకుంటున్నారు ప్రజలు. ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారంత పేదలకు వ్యతిరేకులేనంటూ జగన్‌మోహన్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ రాజకీయం ప్రారంభించినా జనసేన అధినేత పవన్ కల్యాణ్తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇంగ్లిష్ కు వ్యతిరేకం కాదని తెలుగును బతికించాల్సిందేనన్న పట్టుదలతో కొత్త ఉద్యమం ప్రారంభించారు. దానికి “మన నుడి – మన నది” అని పేరు పెట్టారు. 

 


   ఒక్క తెలుగు భాషను మాత్రమే కాక నదుల్నీ కూడా కాపాడాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యమం నిర్మించడానికి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా “మన నుడి.. మన నది” యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజకీయానికి.. “మన నుడి.. మన నది” కి సంబంధం లేదని పవన్ కల్యాణ్ అంటున్నారు. తెలుగు జీవభాషగా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణులు, భాషాభిమానులు, శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.  

 


  విజయవాడ, హైదరాబాద్‌ జనసేన పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. సోమవారం నంచి డిసెంబరు 4వరకూ రోజూ ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఈ విభాగాలు పని చేస్తాయి. వచ్చిన సూచనలను అధ్యయనం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమిస్తారు. ఈ ఉద్యమానికి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, కవి జొన్నవిత్తుల మద్దతు తెలిపారు. భాష, నదుల్ని రక్షించడానికి తాను చేస్తున్న ఉద్యమంలో రాజకీయాలు కలపకూడదని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే.. వాటర్ మేన్ ఆఫ్ ఇండియాగా పేరు పడిన రాజేంద్రసింగ్ తో పవన్ కల్యాణ్.. స్నేహం ఏర్పర్చుకున్నారు. ఆయనతో గంటల తరబడి చర్చలు జరిపారు. ఆయన సలహాలు, సూచనలతో నదుల కోసం జొన్నవిత్తుల, మండలి బుద్ధప్రసాద్ వంటివారితో తెలుగు వెలుగు కోసం ప్రత్యేక కార్యాచరణను పవన్ ఫైనల్ చేసుకునే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: