వైసీపీ మంత్రులు ఉపయోగిస్తున్న భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. వారి భాష వింటుంటే మనం పౌర సమాజంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.  మొన్న పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తన నోటికి అడ్డూ అదుపు లేదన్నట్లు హిందువుల ఇష్టదైవంగా కొలిచే  తిరుపతి వెంకన్నపై వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. స్వర్గస్తులైన ప్రతిపక్షనేత తల్లిదండ్రులపై మాట్లాడే స్థితికి దిగజారాడు. 
నిన్నటికి నిన్న శ్రీకాకుళంలో జరిగిన జాబ్‌ మేళాలో రోడ్లు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్టదాస్‌ సీఎం జగన్‌ మాటలకు నిరుద్యోగులు చప్పట్లు కొట్టలేదని కుక్కలతో పోల్చాడు. అంతకు ముందు 'చెత్తనాకొడుకులు వ్యవస్థలో చీడపురుగుల్లా తయారయ్యారని' ప్రతిపక్ష నేతలను ఉద్ధేశించి మాట్లాడారు. నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌ అసెంబ్లీ సాక్షిగా చేసిన బెదిరింపులు అందరూ చూశారు. రాష్ట్రంలో రౌడి రాజ్యం నడుస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. 
ఆరు నెలల్లోనే పాలనను అస్థవ్యస్తం చేసి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు వెనక్కు వెళ్లిపోయేలా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ యువతకు ఇక ఉద్యోగాలు ఎండమావులే. తెలుగుదేశం ప్రభుత్వం 6 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగభృతి ఇచ్చింది. కానీ, వైకాపా మాత్రం తమ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగులను నట్టేటముంచింది. సచివాలయ ఉద్యోగాలలో 90 శాతం వైకాపా కార్యకర్తలకే వచ్చాయని భాహాటకంగా విజయసాయి రెడ్డే చెప్పారు. జగన్‌ మోహన్‌ రెడ్డికి చప్పట్లు ఎందుకు కొట్టాలి?  అని ప్రశ్నించారు.  
నిరుద్యోగ భృతిని తొలగించినందుకు కొట్టాలా?  పేపరు లీక్‌ చేసి విజయసాయి రెెడ్డి చెప్పినట్లు 90 శాతం మంది వైకాపా కార్యకర్తలను ఉద్యోగాలలో నియమించుకున్నందుకు కొట్టాలా? ఏళ్ల తరబడి పనిచేసే వేలాదిమంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను  తొలగించినందుకు కొట్టాలా? లక్షలాది ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను రాష్ట్రం నుండి తరిమేస్తున్నందుకు కొట్టాలా? సైబరాబాద్‌ వలే 13 జిల్లాల యువతకి ఉద్యోగాలు కల్పించే అమరావతి రాజధానిని నాశనం చేసి యువత భవిత నాశనం చేస్తునందుకు కొట్టాలా? వేరే ఎక్కడన్నా అయితే చప్పట్లకు బదులు ఇవ్వాన్నీ చేస్తునందుకు తోకకు తాటాకులు కడతారు. మంత్రులు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి వారిని ఎందుకు నియంత్రించడంలేదు? ముఖ్యమంత్రే జనసేన నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి దిగజారారు. మంత్రుల చేసిన విమర్శలకు పత్రి విమర్శలు చేసిన లోకేష్‌ బాబును డి.ఆర్‌.సి రానీయమని బెదిరిస్తున్నారు.  ఆరు నెలల జగన్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనడానికి మంత్రులు, ముఖ్యమంత్రుల వ్యాఖ్యలే నిదర్శం.

మరింత సమాచారం తెలుసుకోండి: