చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో అపర చాణిక్యుడు ఎలాంటి జటిలమైన సమస్య అయిన చిటికలో పరిష్కారం చేయగల సమర్ధుడు. అలాంటి నాయకుడు తన రాజకీయానుభవం అంత వయసు కూడా లేని జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఘోరంగా చిత్తయ్యారు. చంద్రబాబు వయసు పైబడడంతో ఇదివరకులా చలాకీగా లేరు ఆ ఆలోచనల్లో పదును లేదు. ఇక టీడీపీ తదుపరి నాయకుడు ఎవర్ని ఉంచాలి అనే దానిపై తీవ్ర తర్జన భర్జన పడుతున్నారన్నది వాస్తవం. 

తన తనయుడు నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పుదామా అంటే, పట్టుమని పది నిముషాలు సరిగ్గా మాట్లాడలేని లోకేష్ ఇక పార్టీని ఎలా నడిపిస్తాడు అని పార్టీలో గుసగుసలు ఇక ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కావాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదే సమయంలో జూనియర్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పడానికి బాబు ససేమీరా అంటున్నారు. ఇక పార్టీ ని నడిపే నాయకుడు ఎవరా అని ఆలోచిస్తున్న తరుణంలో బాబు కు ఒక ఆలోచన వచ్చింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఏ సమస్య ఉండదని బాబు భావిస్తున్నారు. 

జనసేన పార్టీ పెట్టి ఐదు సంవత్సరాలు దాటినా గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఒక్కరంటే ఒక్క సరైన నాయకుడు లేడు. జనసేన పార్టీ స్థానంలో వేరే పార్టీ ఉండి ఉంటే ఎప్పుడో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం అయ్యేది. ఇక పవన్ కూడా టీడీపీ ఎజెండా నే ఫాలో అవుతున్నారు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలనే అనుసరిస్తున్నారు. అవసరమైతే జనసేన పార్టీని టీడీపీలో వీలీనం చెయ్యొచ్చు. ఇక బాబు కూడా తన దత్తపుత్రుడు పవన్ కే పార్టీ పగ్గాలు అప్పజెప్పి ఎన్టీఆర్ కు చెక్ పెట్టాలని చుస్తున్నారంట. అందుకే తెలుగు తమ్ముళ్ళకి లోకేష్ ఎన్టీఆర్ వద్దు పవన్ కళ్యణ్ మనకు ముద్దు అని చెప్తున్నారంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: