అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కలుపుకొని భారతదేశ పటాన్ని సవరించాలని ఎన్డీఏ ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయించి చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలు అయిన, కాశ్మీర్, లడఖ్‌లను చేరుస్తూ భారతదేశం యొక్క మొట్టమొదటి పునర్నిర్మించిన రాజకీయ పటాన్ని సర్వే ఆఫ్ ఇండియా అక్టోబర్ 31 న విడుదల చేసింది, ఈ పటంలో అమరావతిని చూపించలేదు. హైదరాబాద్‌ను ఏపీ మరియు తెలంగాణ పరిపాలనా రాజధానిగా మాత్రమే పేర్కొంది. 

కేంద్రం అమరావతి ని ఏపీ రాజధానిగా పేర్కొనకపోవడంపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమరావతిని తప్పించిన విషయంపై కేంద్రం మౌనంగా ఉండగా, అధికార వైయస్ఆర్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా అమరావతిని రాజధానిగా తెలియజేయలేదని టిడిపిపై వైసీపీ ఆరోపించింది, అయితే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిని బదిలీ చేస్తున్నట్లు కేంద్రానికి సూచించిందని టిడిపి ఆరోపించింది. అందువల్ల అమరావతి పేరు మ్యాప్‌లో తొలగించబడింది అని టీడీపీ ఆరోపించింది. 

"జగన్ ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని వేరే చోటుకి మార్చాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన సందర్భంలో కేంద్రం అమరావతి ని ఏపీ రాజధానిగా ఇండియా మ్యాప్ లో చేర్చింది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా అమరావతినే రాజధానిగా ఉంచాలని జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కేంద్రం వ్యూహం కావచ్చు ”అని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రెండవది, ఈ నిర్ణయం ద్వారా టిడిపి పట్ల బిజెపి కొత్త సమీకరణలకు సూచన కావచ్చు. "గల్లా జయదేవ్ అభ్యర్ధనకు కేంద్రం కొన్ని గంటల్లోనే స్పందించిన విధానం టిడిపి పట్ల బిజెపి సాఫ్ట్ కార్నరుకు సూచన కావచ్చు. అమరావతిని నిర్లక్ష్యం చేసినందుకు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయుడు చేసిన ప్రచారానికి ఇది బలం చేకూరుస్తుంది ”అని వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా, జగన్ ప్రభుత్వం రాజధానిని మంగళగిరి-గుంటూరు వైపుకు మార్చినా, రాజధాని పేరు మార్చబడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: