మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్న విషయం  స్పష్టం అవుతోందని తటస్థులు అభిప్రాయపడుతున్నారు .  ఎన్సీపీ చీలిక వర్గంతో బిజెపి జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం  పట్ల తీవ్ర అభ్యంతరాలువ్యక్తం అవుతున్నాయి .  ఎన్నికలకు  ముందు ఎన్సీపీ నాయకత్వాన్ని  బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్సీపీ తో బీజేపీ ఎప్పటికీ  జతకట్టేది లేదంటూ గతం లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ను ఈ సందర్బంగా తటస్థులు ప్రస్తావిస్తున్నారు .

 

ఇక ఎన్సీపీ నేత అజిత్ పవార్ పై  బీజేపీ నేతలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేయాలో అన్ని చేశారు . ఇప్పుడదే అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల తటస్థులు మండిపడుతున్నారు .  బీజేపీ తో జతకట్టి ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన  అజిత్ పవార్ కు ఇటీవలే సీబీఐ,  ఈడీ నోటీసులు కూడా అందాయి . అజిత్ పవార్ ను త్వరలోనే విచారణ పిలుస్తారన్న  ఊహాగానాలు వినిపించాయి.   అవినీతికి కేరాఫ్ అడ్రస్ అజిత్ పవార్ అంటూ విమర్శలు గుప్పించిన బిజెపి నాయకులు,  ఇప్పుడు అదే అజిత్ పవార్ తో జత కట్టడానికి ఎలా సమర్ధించుకుంటారని తటస్థులు ప్రశ్నిస్తున్నారు . 

 

బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవల్సి  ఉంటుంది . ఇక విశ్వాస  పరీక్షలు ఎలాగో, అలాగా నెగ్గిన , ఈ ప్రభుతం ఎన్నాళ్లు కొనసాగుతుందోనన్న  అనుమానాలు లేకపోలేదు .  ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్య బలం లేకపోయినా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినట్లుగానే బీజేపీ నాయకత్వం , మహారాష్ట్రలోనూ సర్కార్ ను అయితే ఏర్పాటు చేసింది ...కానీ  ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకా ఎన్ని అడ్డదారులు తొక్కనుందోనన్నదే ప్రశ్నార్ధకంగా మారింది .    

మరింత సమాచారం తెలుసుకోండి: