ఒక సెలబ్రెటీ వస్తున్నాడనుకో అక్కడ కనిపించే వాతావరణం మామూలుగా ఉండదు. హడావుడిగా, హంగామాగా, సందడి సందడిగా ఉంటుంది. ఇక ఆ వచ్చే సెలబ్రేటీ చాలా పేరున్న వారెతే ఇక చెప్పక్కర్లేదు. అదే క్రికెట్ వీరుడు విరాట్‌ కోహ్లి నే అలా సరదాగా.. సాదాసీదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడనుకో.. ఆ దృష్యం చూసిన వారు ఒక్క సారిగా షాక్ అవడం ఖాయం.

 

 

అతని వెంట సెల్ఫీ కోసం పరుగుతీయని వారుంటారా చెప్పండి. ఒక్క సెల్ఫీ ఏం ఖర్మ  ఆటోగ్రాఫ్‌ కోసం కూడా అభిమానులు క్యూ కడతారు. అయితే, ఇటీవల ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌కు వచ్చిన కోహ్లికి అలాంటివేమీ ఎదురవలేదు. ఒక్కరు కూడా ‘సెల్ఫీ, ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌’ అంటూ పలకరించలేదు. అదేంటీ.. కోహ్లికి అంతటి అవమానమా అనుకుంటున్నారా! మీరు ఊహించినంత సీన్ ఏం లేదు ఇక్కడ.

 

 

అసలు ట్విస్ట్ చూడండి అదేమంటే అతను అచ్చు కోహ్లిలా ఉన్న మరో వ్యక్తి.  ఇప్పుడు కోహ్లిని పోలి ఉన్నఈ వ్యక్తికి సంబంధించిన వీడియోను @amit_yadav2296 అనే యూజర్‌ టిక్‌టాక్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌ అయింది. ఇకపోతే కోహ్లి హవాభావాలతో అచ్చుగుద్దినట్లుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి.. చాలామంది అతను కోహ్లియేనని భ్రమపడ్డారు. అయితే, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ వస్తున్నప్పుడు అంత సాదాసీదా వాతావరణం ఆ పరిసరాల్లో ఉంటుందా! ఉండదు కదా!

 

 

మామూలుగా చిన్న చితకా వేషాలేసే నటీ నటులు వస్తేనే సెల్ఫీల కోసం... ఆటోగ్రాఫ్‌ల కోసం జనం ఎగబడే జనం సాక్షాత్తు విరాట్ కోహ్లి వస్తే ఇక చెప్పక్కర్లెదు. అని కొందరు ప్రశ్నించుకున్నారట. అంతే కాకుకండా ఈ వీడియోను కాస్త పరిశీలించి చూసి.. అతను కోహ్లి కాదని చివరికి నిర్ధారించుకున్నారు. దీని బట్టి అర్దం ఐందేంటంటే మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఉంటారు అనే నిజం నిజంగా నిజమనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: