2020 సంవత్సరంలో జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు ఏ విధంగా ఉందో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా రచ్చబండ కార్యక్రమంలో ప్రజలనడిగి తెలుసుకుంటారు. ప్రజలు ఇచ్చే వినతుల ఆధారంగా అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలిస్తారు. ఈ మేరకు జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

 

ఇప్పుడు ఆ ప్రకటన వైఎస్ అభిమానుల గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. జగన్ రచ్చబండ కార్యక్రమం ప్రకటిస్తే వైఎస్ అభిమానులు ఎందుకు బాధపడతారు.. ఎందుకు భయపడతారు అని అనుకోవచ్చు. అందుకు కారణం.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమం కోసమే హెలికాప్టర్ లో బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు.

 

అప్పటి నుంచి రచ్చబండ కార్యక్రమం అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్సే. అందుకే ఇప్పుడు జగన్ మళ్లీ రచ్చబండ అనేసరికి వారు కాస్త భయపడుతున్నారు. అయితే దమ్మున్న నాయకుడు.. పరిపాలనలో కొత్త దృక్పధం, పనుల్లో పారదర్శకత, నిర్ణయాల పట్ల నిబద్ధత ఇవన్నీ ఉన్న నాయకుడు ప్రజల్లోకి వెళ్లడానికి ఆలోచించడు. నే చేసిన పాలన ఎలా ఉందో చెప్పండి...సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి అంటూ నిఖార్సుగా మాట్లాడే నాయకుడు జనంలోకే వెళ్తాడు.

 

జగన్ కూడా అదే కోవకు చెందుతాడు. దాచిపెట్టడాలు, దాటవేతలూ లేవు. శిలాఫలకం వేస్తే రెండు వారాల్లో పని ప్రారంభం కావాల్సిందే అని ప్రకటించే గట్స్ చూసి అధికారులే నివ్వెరపోతున్నారు. తాత్సారాలు, నాన్చివేత ధోరణలు ఈ నాయకుడి దగ్గర పనికి రావు. నిజంగా పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా? పక్కదారి పడుతున్నాయా? అధికారులు ప్రజలు మెచ్చేలా పనిచేస్తున్నారా? ప్రజా సమస్యల పట్ల సరైన రీతిలో స్పందిస్తున్నారా? క్షేత్ర స్థాయిలో పథకాల అమలు తీరు తెన్నులు ఎలా ఉన్నాయి? ఇవన్నీస్వయంగా తెలుసుకుని, లోపాలుంటే సరిదిద్దుకునేందుకే ముఖ్యమంత్రి రచ్చబండ ప్రారంభిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: